| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నేరమేమి నాపై నీరజాక్షరామ |
| తోడి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నేరమేమి నాపై నీరజాక్షరామ భారమేమినీకు నన్నుబ్రోచుటకు॥ |
| అనుపల్లవి: |
| నేరమెంచకనె దయచేసి నీవు క్రూరుడైన కాకాసురుని బ్రోవలేద॥ |
| చరణము(లు): |
| అంతరాత్మ నాదు చింతదీర్చుమని ఎంతవేడుకొందు పంతమేలనాతో॥ |
| చింతితార్థమిచ్చే విభుడు నీవేగదా దంతివరద శ్రీకాంత వాసుదేవ॥ |