| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నన్ను బ్రోవగరాద వేగమె |
| మధ్యమావతి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నన్ను బ్రోవగరాద వేగమె సన్నుతాంగ శ్రీసీతాపతే॥ |
| అనుపల్లవి: |
| నిన్ను నమ్మినవాడని యెంచి నాదు విన్నపంబు విని నిండుప్రేమతో॥ |
| చరణము(లు): |
| జ్ఞాన భక్తి వైరాగ్యము గలిగి రాయి ధ్యానమేమి జేసెనో దెలుపవయ్య॥ |
| వానరేంద్రునిపై ప్రేమబుట్టలేద గానలోల వాసుదేవ దేవదేవ॥ |