| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దయలేక బ్రతికి ఫలమేమి రాముని |
| శ్రీరంజని - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దయలేక బ్రతికి ఫలమేమి రాముని ధర్మాత్ముని ధరణిజా ప్రాణనాథుని॥ |
| అనుపల్లవి: |
| వయసు శాశ్వతమని దెలిసి కాలుని భయము లేక సదాదుర్వృత్తులైన మానవులు॥ |
| చరణము(లు): |
| రాముని పరవాసుదేవుని నమ్మితె కామిత ఫలములు కరగతమే గదా॥ |
| ఈ మహిలో మహాత్ములకిది దెలుసును శ్రీమదాది త్యాగరాజుడే సాక్షి గదా॥ |