| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కరుణించినన్ను కాపాడు రామ |
| నవరస కన్నడ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కరుణించినన్ను కాపాడు రామ మరివేరె దిక్కెవరులేరు॥ |
| అనుపల్లవి: |
| శరచాపధరాశ్రితపాపహర ధరణీసుతావర మరవకుర॥ |
| చరణము(లు): |
| పరమార్థమార్గము తెలియదు పరమభక్తి జేసి సన్నుతించలేదు॥ |
| శరణాగతరక్షక నీవెగద పరవాసుదేవ భవభయముదీర్చి॥ |