| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కృపతోను నన్ను రక్షించుటకు |
| హరికాంభోజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కృపతోను నన్ను రక్షించుటకు ఎపుడైన నీవేగతిగాద రామ॥ |
| అనుపల్లవి: |
| అపరాధమెంతో జేసినావనుచు అపుడు ఇపుడని జెప్పగ॥ |
| చరణము(లు): |
| వాసుదేవ పరాత్మర నీదుమహిమ శ్రీసరోజభవాదులె తెలియలేరు॥ |
| దాసజనులపాపమెల్ల దీర్చుటకు నీసమానమెవరయ్య బ్రోవవయ్య॥ |