| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నన్నుబ్రోచుటకెవరున్నారు |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నన్నుబ్రోచుటకెవరున్నారు సన్నుతాంగ శ్రీసీతారమణ॥ |
| అనుపల్లవి: |
| కన్నతండ్రియు నీవె గద నన్ను మరవకురాశ్రితవరద నిన్నునమ్మినవాడగద నా విన్నపంబు వినరాదా వాదా॥ |
| చరణము(లు): |
| కరుణాకరాఖిలజగదాధార శ్రీరఘువర పరనారీసహోదర పాపవిదూర పరాత్పర॥ |
| కరశోభితచాపశరస్మరకోటిసుందర సురమానస మోదకర పర వాసుదేవ శ్రీకర॥ |