| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి |
| బిలహరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శ్రీచాముండేశ్వరి పాలయమాం కృపాకరి శంకరి శ్రితజనపాలిని మహాబలాద్రివాసిని మహిషాసురమర్దిని॥ |
| అనుపల్లవి: |
| వాచామగోచర మహిమవిరాజితే వరగుణభరితే వాక్పతిముఖ సురవందితే వాసుదేవ సహజాతే॥ |
| చరణము(లు): |
| రాకానిశాకర సన్నిభ వదనే రాజీవలోచనే రమణీయ కుందరదనే రక్షిత భువనే మణిరశనే॥ |
| మూకవాక్ప్రదానవిఖ్యాతే మునివరనుతిసుప్రీతే శ్రీకరతారకమంత్రతోషితచిత్తే సదా నమస్తే॥ |