| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఇంతపరాకేలనయ్య |
| కమాస్ - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| ఇంతపరాకేలనయ్య దంతిమోక్షదాయక నీకు॥ |
| అనుపల్లవి: |
| ఎంతవేడుకొందు రమాకాంత దాంత వినుత చరిత॥ |
| చరణము(లు): |
| శ్రీధర పర వాసుదేవ యాదవకులతిలక నాతో వాద మేల పరమ పురుష వేదశాస్త్ర తత్త్వజ్ఞులే॥ |
| నీదుమహిమ తెలియలేరు పాదములను నెరనమ్మితి॥ |