| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీదయ ఎటుల గల్గునో రామ |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీదయ ఎటుల గల్గునో రామ నీరజ లోచన నిరుపమ సుగుణ॥ |
| అనుపల్లవి: |
| ఆదరముగ నీపాదమునమ్మిన సాధులవలె భవ బాధలేక యుండుటకు॥ |
| చరణము(లు): |
| మందరధర గోవింద నీవేగతి ముందువెనక తోచగ నిన్ను నమ్మితి కుందరదన శరదిందు నిభానన సింధుశయన సురబృందవందిత నాపై॥ |
| సామజవరద నిన్నేమని పొగడుదు కామజనక నీకెందుకు నిర్దయ శ్రీమనోహర కనకాంబర గిరిధర శ్యామసుందర సుగుణాకర నామీద॥ |
| దాసజనుల పరితాపములెల్లను వేసరక దీర్చేవాడు నీవేగద వాసుదేవ జగదీశ జనార్దన భాసుర మణిమయభూష మంజులభాష॥ |