| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఎంతని నే వర్ణింతునో |
| నాటకురంజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ఎంతని నే వర్ణింతునో దంతివరద శ్రీవాసుదేవ॥ |
| అనుపల్లవి: |
| చింతితార్థమిచ్చి బ్రోవరాద దాంతవినుత పరమాద్భుత సుచరిత॥ |
| చరణము(లు): |
| నీలరుచిరచికురజాల - కరధృత శైల రమాలోల - గానలోల॥ |
| బాలగోపాల దీనపాల బాలుడై ధృవుని బ్రోవలేద॥ |