| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | తరముగాదుర - రఘువర నీకిది |
| శహన - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| తరముగాదుర - రఘువర నీకిది త్వరితముగ నన్ను - బ్రోవకుండేది॥ |
| అనుపల్లవి: |
| సరసిజలోచన - సకలలోకావన నిరవధిసుఖద - నీకెందుకు నిర్దయ నాపై॥ |
| చరణము(లు): |
| కరిమొరలను విని - బ్రోవలేద - మును పరమ భక్తుడైన - ప్రహ్లాదుని బ్రోవలేద॥ |
| మురహర వాసుదేవ - మదన కోటి సుందర వరమైన నీదు మహిమ - వర్ణింప నా తరమ॥ |