| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నిమిషమైన శ్రీరామ యనరాద - నిత్యముగాదీ మానవ జన్మము॥ |
| సామ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నిమిషమైన శ్రీరామ యనరాద - నిత్యముగాదీ మానవ జన్మము॥ |
| అనుపల్లవి: |
| అమిత మహిమ గలవాడని రాముని ఆ మహాదేవుడే - సన్నుతించుచుండగ॥ |
| చరణము(లు): |
| హరిహర మంత్రమునకు - జీవవర్ణాత్మకుడు సురరిపురావణుని నిగ్రహించినవాడు॥ |
| పరమభక్తులనెల్ల పాలించువాడు పరమపురుషుడతడె - వాసుదేవుడని దెలసి॥ |