| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | వరములొసగి బ్రోచే బిరుదు నీకుండగ |
| శుద్ధ సావేరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| వరములొసగి బ్రోచే బిరుదు నీకుండగ సరగున నన్ను పాలింపరాద రామ॥ |
| అనుపల్లవి: |
| ధరణిజా రమణ నీమహిమ వర్ణింప నా తరముగాదు - నే పరులను వేడను॥ |
| చరణము(లు): |
| ఓ కమలాసనాది వినుత సుచరిత శ్రీకర తారక మంత్ర రూపాశ్రిత॥ |
| లోకరక్షక వాసుదేవ దయాన్విత నీకృపగల్గని కారణమేమయ్య॥ |