| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీకభిమానము లేద రామ నాపై |
| కోకిలప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీకభిమానము లేద రామ నాపై నీరజనేత్ర నీరదనిభగాత్ర॥ |
| అనుపల్లవి: |
| ఓ కమలాసనాది వినుత చరణ లోకరక్షక వాసుదేవ కృపాకర॥ |
| చరణము(లు): |
| భూమిజా మానసాంభోరుహ భాస్కర నీమహిమలు నేనేమని పొగడుదు॥ |
| కామితార్థ ఫలదాన ధురీణ ప్రేమతో బ్రోచె సమయ మిదేగద॥ |