| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పాహిమాం క్షీరసాగర తనయే |
| తోడి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పాహిమాం క్షీరసాగర తనయే మోహనాంగ వాసుదేవజాయే॥ |
| అనుపల్లవి: |
| దేహిమే ముదం మణిమయవలయే గేహమావిశమామకంసదయే॥ |
| చరణము(లు): |
| విరించి శర్వాది సంపూజితే సరోజదళ నయన సంశోభితే విరాజమానహేమ వసనయుతే వరాభరణ భూషితె సుమహితే॥ |
| దరహాసయుతే మునివినుతే శరణగతేప్సిత కల్పలతే నిరుపమ సౌందర్య పూరితే నిఖిల కల్యాణ గుణభరితే॥ |