| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర |
| కమాస్ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| బ్రోచే వారెవరుర - నినువిన - రఘువర నీ చరణాంబుజమును నే విడజాల కరుణాలవాల॥ |
| అనుపల్లవి: |
| ఓ చతురాననాదివందిత నీకు పరాకేలనయ్య నీ చరితము పొగడలేను నాచింతదీర్చి - వరములిచ్చి వేగమె॥ |
| చరణము(లు): |
| సీతాపతే నాపై నీ కభిమానములేద వాతాత్మజార్చితపాద నామొరలను వినరాద॥ |
| ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవుగదా నాపాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చైబట్టి విడవక॥ |