| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నిన్నేశరణంటినయ్య - నీరజాక్ష |
| ధేనుక - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నిన్నేశరణంటినయ్య - నీరజాక్ష నన్ను బ్రోవవయ్య - శ్రీరుక్మిణీ రమణ॥ |
| అనుపల్లవి: |
| పన్నగేంద్ర శయన - పన్నగారి వాహన పన్నగాచలవాస - వాసుదేవ - దేవాదిదేవ॥ |
| చరణము(లు): |
| సురభూసురార్తిహరణ కరుణాకరామితసుగుణ శరదిందుసన్నిభవదన పురవైరి మానససదన॥ |
| కరిరాజుని కృపతో మునుబ్రోవలేద నెరనమ్మినవారికి నిత్యానందమిచ్చేవాడని॥ |