| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మహాత్ములే తెలియలేరు నీ మహామహిమ రామ |
| ఋషభప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| మహాత్ములే తెలియలేరు నీ మహామహిమ రామ మహానుభావాశ్రితమందార - ఏమిపొగడుదు నీదు మహిమ॥ |
| అనుపల్లవి: |
| మహీసుతామనోహర - మదనకోటిసుందర మహాప్రభో నన్ను మరవకుర - కృపజేసి బ్రోవవయ్య॥ |
| చరణము(లు): |
| కరధృతసురుచిర చాపశర సురరిపుదశముఖనాశకర పురహర కార్ముక దర్పహర సురమునిమానసతోషకర॥ |
| పరాంగనా సహోదర పరమపురుషశ్రీకర పరాత్పర వాసుదేవ కరుణాసాగర॥ |