| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శంభోశంకర పాహిమాం |
| కేదారగౌళ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శంభోశంకర పాహిమాం జంభారి వినుత పాదాంభోరుహ॥ |
| అనుపల్లవి: |
| అంభోధిరాజగర్వహరణ నిపుణ కుంభోద్భవాది సకల మునిజన శరణ॥ |
| చరణము(లు): |
| కరుణాకర - వాసుదేవమోదకర పరమేశ్వర - గిరీశ - శివ పశుపతే॥ |
| గిరిరాజబాలికా కరాంబురుహ పరిపూజితాహిభూష చంద్రమౌళే॥ |