| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | గురుకృపలేక శ్రీహరికృప గల్గునా |
| పుష్పలతా - త్ర్యశ్ర రూపక |
| పల్లవి: |
| గురుకృపలేక శ్రీహరికృప గల్గునా హరిమతమే గురుమతము గాదేమయ్య॥ |
| అనుపల్లవి: |
| గురుకృపలేక భాస్కరతనూజునికి మును కరగతమైన దివ్యాస్త్రములేమాయె॥ |
| చరణము(లు): |
| గురుకృప గల్గిన సురపతి తనూజుని పరమపురుషుడైన శ్రీవాసుదేవుడే॥ |
| పరమాదరముగ పాలించెలేదా దొరకునేమి కలినరులకీ భాగ్యము॥ |