| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీవేగతియని నిన్ను నెరనమ్మితి నీరజాక్ష కృష్ణ॥ |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీవేగతియని నిన్ను నెరనమ్మితి నీరజాక్ష కృష్ణ॥ |
| అనుపల్లవి: |
| నీవేపాంచాలిని ప్రహ్లాదుని బ్రోవలేద శ్రీవాసుదేవ॥ |
| చరణము(లు): |
| నీవనాదరణ జేసితె యెవరు నన్నుబ్రోచే వారు॥ |
| దేవదేవ శ్రీరుక్మిణీరమణ జీవలోకరక్షణ ధురీణ॥ |