| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భజనసేయరాదా - ఓమనస - శ్రీరాముని॥ |
| ధర్మవతి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| భజనసేయరాదా - ఓమనస - శ్రీరాముని॥ |
| అనుపల్లవి: |
| అజభవేంద్రాదినుతుని - సుజనావనలోలుని॥ |
| చరణము(లు): |
| పరనారీ సహోదరుని - పరిపూర్ణకాముని ధరణిజామనోహరుని - పరవాసుదేవుని॥ |
| శరణజనాధారుని - సరసీరుహనేత్రుని నిరవధి సుఖదాయకుని - పరమాత్ముని భక్తపాలుని॥ |