| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కరుణించి బ్రోవరాదా |
| బంగాళ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కరుణించి బ్రోవరాదా ధరణీసుతావర శ్రీరఘువీర॥ |
| అనుపల్లవి: |
| శరచాపధరాశ్రిత మందార పరిపూర్ణకామ రవికులసోమ॥ |
| చరణము(లు): |
| పరమాత్మ నీవుధరలోను బుట్టి సురవైరి రావణుని నిగ్రహించి॥ |
| సురభూసురాదుల కెల్ల చాలా పరితోషమిచ్చితివిగదా వాసుదేవ॥ |