| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నా చై విడవకురా - నామీద దయయుంచరా॥ |
| నాటకురంజి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| నా చై విడవకురా - నామీద దయయుంచరా॥ |
| అనుపల్లవి: |
| ఓ చరాచరాధారా నీ చరణము నెరనమ్మితి॥ |
| చరణము(లు): |
| దేవదేవ శ్రీవాసుదేవ మహాదేవ వినుత నావ్యథలను దీర్చుటకు నీవుగాక వేరెవరు॥ |
| భావుక ఫలదానచతుర భువనమోహనాకార దేవకీసుకుమార బ్రోవవయ్య శ్రీకర॥ |