| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీకెంత నిర్దయ రామ నాపై |
| భవప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీకెంత నిర్దయ రామ నాపై నీరజాసనాది వినుత॥ |
| అనుపల్లవి: |
| శ్రీకాంతవాసుదేవ దేవదేవ శ్రితభక్తపాలన ధురీణ॥ |
| చరణము(లు): |
| నిన్ను నమ్మినవాడని తెలియలేదా కన్నతండ్రినీవేయని నమ్మలేదా॥ |
| పన్నగశయనాశ్రితపాపహరణ విన్నపంబుజేతు నన్నుబ్రోవరాదా॥ |