| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దయతో నన్ను పాలింపవయ్య |
| సురటి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దయతో నన్ను పాలింపవయ్య దశరథకుమార నీవు॥ |
| అనుపల్లవి: |
| వయసు నూరున్నది యని వనజనాభ నిన్నే మరచితినయ్య॥ |
| చరణము(లు): |
| వాసుదేవ నీవే గతి యనుచు నమ్మి దాసవర్యులెల్ల ముక్తిపొందలేద॥ |
| ఆశతోను ఒక నిమిషమైన నిన్ను దాస భావముతో భజన సేయలేదు॥ |