| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మామవతు శ్రీసరస్వతీ |
| హిందోళ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| మామవతు శ్రీసరస్వతీ కామకోటి పీఠ నివాసినీ॥ |
| అనుపల్లవి: |
| కోమలకరసరోజ ధృతవీణా సీమాతీత వరవాగ్విభూషణా॥ |
| చరణము(లు): |
| రాజాధిరాజ పూజిత చరణా రాజీవనయనా రమణీయవదనా॥ |
| సుజన మనోరథ పూరణచతురా నిజగళశోభిత మణిమయహారా॥ |
| అజభవవందిత వాసుదేవచరణార్పిత సకలవేదసారా॥ |