| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | సంకర్షణ మాంపాలయ |
| ఆభోగి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| సంకర్షణ మాంపాలయ పంకజనయన కృపాలయ॥ |
| అనుపల్లవి: |
| పంకజభవ వినుత చరణ లంకాధిపహరణ నిపుణ॥ |
| చరణము(లు): |
| భాసురశర కార్ముకధర శాసితఖర మఖ నిశిచర॥ |
| కోసలనృప వరకుమార వాసవాది పాలనపర॥ |
| శ్రీసమేత పీతాంబర దాసవర్య మంగళకర॥ |
| భాసమాన మురళీధర వాసుదేవ దామోదర॥ |