| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మనసా వచసా శిరసానిశం భజతదేవదేవం |
| బేగడ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| మనసా వచసా శిరసానిశం భజతదేవదేవం సనకాదిమునిగణ శరణం నారసింహం వాసుదేవం॥ |
| అనుపల్లవి: |
| వనజాసనాద్యభివందిత వరచరణం స్తంభ సముద్భవం దినరాజకోటిసన్నిభం హతహిరణ్యకశిపుదానవం॥ |
| చరణము(లు): |
| కరుణాన్వితం కల్యాణగుణభరితం శరణాగత ప్రహ్లాద పోషణరతం॥ |
| కరిరాజ పాంచాలీముఖనుత మిం దిరాపతి మఘరహితం సురరిపుభయానకాద్భుత చరితం వరదివ్యవిభూషణ విలసితం॥ |