| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కలినరులకు నీమహిమ దెలుసున |
| మాయామాళవగౌళ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కలినరులకు నీమహిమ దెలుసున కమలనయన వాసుదేవ మహానుభావ॥ |
| అనుపల్లవి: |
| జలధిశయన జగజ్జన్మాదికారణ జలజసంభవ భవేంద్రాది వందితచరణ॥ |
| చరణము(లు): |
| సులలితమగు నీచరణము సోకగ శిలయే యహల్యయై వెలయలేద మును॥ |
| బలిని ప్రహ్లాదుని ధ్రువుని పాంచాలిని సలుపలేదేమయ్య హలధరసోదర॥ |