| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ప్రణమామ్యహం శ్రీప్రాణనాథం నిరంతరం |
| రంజని - మిశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ప్రణమామ్యహం శ్రీప్రాణనాథం నిరంతరం ప్రణతజనాభీష్టఫలప్రద శ్రీరామసేవాధురంధరం॥ |
| అనుపల్లవి: |
| ప్రాణాపానవ్యానాద్యాఖ్య ముఖ్యప్రాణం ప్రాణినాం ప్రాణభూతం ప్రీణితాశేషపాత్రం భరద్వాజాది వినుత భారతీకళత్రం॥ |
| చరణము(లు): |
| అంజనాగర్భ సంభూత వీరాగ్రేసరం ని రంజన శ్రీ వాసుదేవహృదయాగారం సు మంజుల ముఖారవింద జానకీప్రియకరం రిపు భంజన చతురం ఋగ్వేద సువిదిత మహిమాకరం॥ |
| రంజనీరాగతోషితం కుంజరాస్యాదివందితం సంజీవనోజ్జీవిత సుమిత్రాసుతం॥ |