| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రారా రాజీవలోచన రామ నన్ను బ్రోచుటకు |
| మోహన - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| రారా రాజీవలోచన రామ నన్ను బ్రోచుటకు ధీరాశ్రితజనమందార కరుణాపారావార॥ |
| అనుపల్లవి: |
| ఏర నీ కరుణ గల్గని కారణమేమో గానర మారారి వినుత శుభద సుచరిత పరాత్పర ధరణిజా మనోహర॥ |
| చరణము(లు): |
| నీవే నా విభుడని నిరతము నీ పాదములను నెరనమ్మితి నీవాడని నన్ను కరుణించి ఈవేళ నాచై విడువకుర॥ |
| దేవదేవ దశరథనృపనందన దశముఖాది సకలరిపుగణహరణ నీవనాదరణ సేయకుర పవనజాప్త శ్రీవాసుదేవ॥ |