| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దయలేదేమి రామ పూర్ణకామ |
| సింహేంద్రమధ్యమ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దయలేదేమి రామ పూర్ణకామ దశరథనందన దశముఖమర్దన॥ |
| అనుపల్లవి: |
| దయజేసి భక్తుల తాపముదీర్చిన ధర్మాత్ముడనుచు బిరుదు నీకుండగ॥ |
| చరణము(లు): |
| సరసిజ సంభవాది వినుతచరణ నిరతము నిన్నే నమ్మితినయ్య॥ |
| పరవాసుదేవ పరాత్పర శ్రీకర నిరుపమ మహిమ నిన్నేమని పొగడుదు॥ |