| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నమోస్తుతే దేవి సరస్వతి |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నమోస్తుతే దేవి సరస్వతి సుమాళి భూషితే సురవినుతే॥ |
| అనుపల్లవి: |
| విమూఢమతిదాన విఖ్యాతే రమేశ వాసుదేవ వినుతిరతే॥ |
| చరణము(లు): |
| శరణాగత పరిపోషణ నిరతే కరుణారస భరితే దరహాసితే॥ |
| కరధృతవర వీణాదిశోభితే సరసిజ సంభవదయితే మహితే॥ |
| సరసిజవదనే సరోజనయనే సురుచిర మరకతమణి రశనే॥ |
| పరమవేద మంత్రాక్షరసదనే నిరుపమ మంగళకర గదనే॥ |