| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భజమానస సరస్వతీం శుభచరితాం విధిదయితాం |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| భజమానస సరస్వతీం శుభచరితాం విధిదయితాం నిజపాద పంకజ వినతాశ్రితజన పోషణ నిరతాం॥ |
| అనుపల్లవి: |
| సుజనేష్టవేదసదనాం నిజపాణిధృత వరవీణాం ద్విజరాజసన్నిభవదనాం గజరాజమంద గమనాం॥ |
| చరణము(లు): |
| దేవదేవ శ్రీవాసుదేవ పరమానుగ్రహ భరితాం భావనాతిదూర నిరుపమమహిమాతిశయ సమన్వితాం॥ |
| భావరాగతాళాది సుమధుర సంగీత రసాస్వాదినీం కైవల్యమార్గ బోధక సుప్రతిభా విశేషదాయినీం॥ |