| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరులనువేడి నే పామరుడైతిని |
| నాగస్వరావళి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరులనువేడి నే పామరుడైతిని పరమపురుష వాసుదేవ దయానిధే॥ |
| అనుపల్లవి: |
| సరసిజభవ భవాదివినుతచరణ సరసిజలోచన సాగరశయన॥ |
| చరణము(లు): |
| సరగున మును కరిరాజుని బ్రోవలేద కరుణతో ధ్రువుని ప్రహ్లాదుని బ్రోవలేద॥ |
| శరణరక్షక నీదు బిరుదుని మరవక వరములొసగి నన్ను పాలింపవయ్య॥ |