| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | వరలక్ష్మి నమోస్తుతే |
| గౌరీమనోహరి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| వరలక్ష్మి నమోస్తుతే వరదే నరహరి సుఖదే॥ |
| అనుపల్లవి: |
| అరవిందలోచనే - అఘబృందమోచనే అరుణాంబుజవర సదనే - అమరేంద్ర నుతచరణే॥ |
| చరణము(లు): |
| వాసుదేవ వినుతిరతే - వాసవాది వందితే భూసురాది సేవితే - భాసురమణి భూషితే దాసజన కల్పలతే - దరహాసితే సువృత్తే॥ |