| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఎవరిని వేడను ఎవరిని పొగడను |
| బిలహరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ఎవరిని వేడను ఎవరిని పొగడను భువనరక్షక రామ నినువినా నేను॥ |
| అనుపల్లవి: |
| అవనిజా సౌమిత్రి భరత శతృఘ్న పవనజ విభీషణాది వినుత సుచరిత॥ |
| చరణము(లు): |
| సామజరాజుని ధ్రువుని ప్రహ్లాదుని ప్రేమజేసి నీవే బ్రోవలేద మును॥ |
| శ్యామసుందరగాత్ర సరసిజదళనేత్ర కామితఫలద శ్రీ పరవాసుదేవ నే॥ |