| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | కైలాసపతే మాంపాహి (భూ) |
| కల్యాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| కైలాసపతే మాంపాహి (భూ) కల్యాణమూర్తే సదా నమస్తే॥ |
| అనుపల్లవి: |
| శైలాధిరాజకన్యాపతే కాలాభ్రనీలగళ కరుణానిధే (భూ)॥ |
| చరణము(లు): |
| హరిణాంక శేఖర గంగాధర గరపురీశ్వర గజచర్మాంబర॥ |
| పరిపాలిత మునివర సుకుమార పరవాసుదేవ సన్నుతి తత్పర॥ |
| నిరుపమ నిజతాండవ పరితోషిత సురమునికిన్నరాది భక్తనికర దరహాసవదన పరమభక్త పార్థవరద శంభోశంకర (భూ)॥ |