| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | హరిని భజించే భాగ్యము దొరకునేమి? |
| శంకరాభరణం - ఖండ త్రిపుట |
| పల్లవి: |
| హరిని భజించే భాగ్యము దొరకునేమి? దొరకును దొరకును పరమభక్తులకు నిజముగ॥ |
| అనుపల్లవి: |
| ధరణిజా మానసాంభోరుహ విభాకరుని దశరథరాజేంద్ర సుకుమారుని ధర్మాత్ముని॥ |
| చరణము(లు): |
| కరుణాసముద్రుని కల్యాణమూర్తిని పరిపూర్ణకాముని పరవాసుదేవుని॥ |
| తరణివంశాంబుధి చంద్రుని పరాత్పరుని స్థిరముగ నమ్మినవారికి మోక్షమిచ్చే విభుని॥ |