| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నిన్నే నమ్మితినయ్య శ్రీరామ॥ |
| సింహేద్రమధ్యమ - మిశ్రచాపు |
| పల్లవి: |
| నిన్నే నమ్మితినయ్య శ్రీరామ॥ |
| అనుపల్లవి: |
| పన్నగేంద్రశయన పన్నగారి వాహన పన్నగాచల భవ్యసదన ప్రపన్నార్తిహరణ నిపుణ॥ |
| చరణము(లు): |
| పరమకృపాసాగర పరతత్త్వాధార వరములొసగి బ్రోవవయ్య వాసుదేవ॥ |
| నీరజనేత్ర నీరజనిభగాత్ర గిరిరాజసుతావర శంకరసన్నుతిపాత్ర సచ్చరిత్ర॥ |