| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నీ పాదములే నమ్మితినయ్య |
| సరసాంగి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నీ పాదములే నమ్మితినయ్య నీరజాక్షరామ నిత్యపూర్ణకామ॥ |
| అనుపల్లవి: |
| అపరాధముల దీర్చి బ్రోచుటకు వేరెవరయ్య దేవాదిదేవ॥ |
| చరణము(లు): |
| నీ మనసు కరగదేమి శ్రీ రుక్మిణీరమణ పరవాసుదేవ॥ |
| సామజాది మహాభక్త బృందపాల సామగానలోల సత్యధర్మపాల॥ |