| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దాశరథే పాహిమాం దయాపయోనిధే సుగుణనిధే॥ |
| బిలహరి - త్ర్యశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దాశరథే పాహిమాం దయాపయోనిధే సుగుణనిధే॥ |
| అనుపల్లవి: |
| ఈశవినుత చరణారవింద ఇనకులాంబుధి చంద్ర ఈశ చాపమదఖండనధురీణ సురమునిగణవినుత చరణ॥ |
| చరణము(లు): |
| కుశలవగానలోల కుశికాత్మజసవపాల విశదీకృతజగల్లీల దశరథవరబాల॥ |
| ప్రశమితసురగణవైరిజాల భృశమానతార్తిహరణశీల శశినిభముఖ హిరణ్మయచేల శ్రీశ వాసుదేవ దయాలవాల॥ |