| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | స్మరరామచంద్రం స్మరసుందరం |
| శంకరాభరణం - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| స్మరరామచంద్రం స్మరసుందరం స్మరవైరి మానసమందిరం॥ |
| అనుపల్లవి: |
| శరచాపధరం నృపశేఖరం ఖరరావణాద్యరిహరముదారం॥ |
| చరణము(లు): |
| కరుణాకరం శ్రితమందారం దురితౌఘహరం జగదీశ్వరం॥ |
| సురభూసురాద్యభివందితం పరవాసుదేవం సతతం॥ |