| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఇంతపరాఙ్ముఖమేల శ్రీరఘువర |
| కల్యాణి - మిశ్ర ఝంప |
| పల్లవి: |
| ఇంతపరాఙ్ముఖమేల శ్రీరఘువర ఇకనైన నామనవి వినరాద॥ |
| అనుపల్లవి: |
| దాంతవినుత శ్రీజానకీకాంత నాదు చింతదీర్చి వరములిచ్చి పరిపాలించుటకు॥ |
| చరణము(లు): |
| నీవు భక్తవత్సలుడని నేనెంచి నీవేగతియని నిన్ను నమ్మలేద॥ |
| భావనాతీత నిరుపమామితవిభవ దేవదేవ భవనుత శ్రీవాసుదేవ నీకు॥ |