| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఇందిరారమణ గోవింద |
| కమాస్ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ఇందిరారమణ గోవింద సుందరవదనారవింద మామవ॥ |
| అనుపల్లవి: |
| మందరాద్రిధరాశ్రిత మందార మందస్మిత ముకుంద శ్రీకర॥ |
| చరణము(లు): |
| భాసుర యదుకులసంజాత భూసురాది సకలలోక సన్నుత॥ |
| వాసవాద్యమరసేవితచరణ వాసుదేవ కంసాద్యరిహరణ॥ |