| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భజరే మానస శ్రీరఘువీరం |
| ఆభేరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| భజరే మానస శ్రీరఘువీరం భుక్తిముక్తిప్రదం వాసుదేవం హరిం॥ |
| అనుపల్లవి: |
| వృజిన విదూరం విశ్వాధారం సుజన మందారం సుందరాకారం॥ |
| చరణము(లు): |
| రావణమథనం రక్షితభువనం రవిశశినయనం రవిజారి మర్దనం॥ |
| రవిజాది వానర పరివృతం నరవరం రత్నహార పరిశోభిత కంధరం॥ |
| మధ్యమకాల: |
| రవిశశి కుజబుధ గురుశుక్ర శనైశ్చర రాహుకేతునేతారం రాజకుమారం రామం పవనజాప్తమవనిజామనోహరం॥ |