| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రామాభిరామ - మామవ శ్రీరామ॥ |
| మధ్యమావతి - త్ర్యశ్ర త్రిపుట |
| పల్లవి: |
| రామాభిరామ - మామవ శ్రీరామ॥ |
| అనుపల్లవి: |
| రామ రవికులలలామ - రాక్షసకులభీమ రామచంద్ర సుగుణసాంద్ర - శ్రీమానసాంబుధిచంద్ర॥ |
| చరణము(లు): |
| పవనాత్మజ సంపూజిత - పరమాద్భుత నిజచరిత దేవాదిదేవ మాధవ - శ్రీవాసుదేవ సార్వభౌమ సత్యకామ - సర్వలోకవంద్య రామ॥ |