| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
12. ఆపేక్ష |
| 12. ఆపేక్ష |
|
ఆపేక్షగల అన్న అర్ధచంద్రుడైతె అది వదినకిత్తునూ అణచి ముక్కున బెడుదు అమ్మరో! విన్నావటే ఈమాట అన్నతో అన్నావటే .. నా సిగలో పువ్వల్లె నలినాక్షి పెదవదిన నలిగిపోయీ నన్ను తొలగి చూచునొ యేమొ అమ్మరో! విన్నావటే ఈమాట అన్నతో అన్నావటే ... పులకరించని మేన పలుకరించని తాను పట్టిలాగుచు బాధపెట్టునేమో నన్ను అమ్మరో! విన్నావటే ఈమాట అన్నతో అన్నావటే .. చుక్కంటి మావదిన చక్కన్ని చూపులో చిక్కబట్టిందంటె టక్కరైపోతాడె అమ్మరో! విన్నావటే ఈమాట అన్నతో అన్నావటే .. |