| శతకములు | కాంతాలలామ శతకము | నృసింహాచార్య |
| కాంతాలలామ శతకము | ||
| సీ. | శ్రీకరంబగు నీదు చిన్నారి నెమ్మోము | సొగసు నేఁ బలుమారుఁ జూచిచూచి అందమైనట్టి నీ యలరుఁ గెమ్మోవిని | పలుగంటు సేయంగఁ దలఁచితలఁచి తళతళలీను నీ కులుకుగుబ్బల గోరు- | లుంచఁగా నాదు చే యొగ్గియొగ్గి పచ్చవిల్కానిసామ్రాజ్య మేలినయట్లు | చేరి నిన్ గలయఁగాఁ గోరికోరి | |
| గీ. | మారుబారికిఁ జిక్కి నెమ్మదిని జొక్కి | నీకుఁ దక్కితిఁ గదవె నా నెనరు దెలిసి గారవింపుము దయయుంచి కీరవాణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 1 |
| సీ. | పదివన్నెబంగారువంటి నీ మైనిగ్గు | జిలిబిలిమాటల పలుకుజగ్గు బిగువైన గబ్బిసిబ్బెపుగుబ్బల బెడంగు | నెరకప్పు మీఱు ముంగురులరంగు ఘమ్ముఘమ్ముమటంచుఁ గ్రమ్ము మైనెత్తావి | మొనపంటిగంటి కెమ్మోవికావి తళుకైన చెక్కుటద్దంబుల యందంబు | నెరజారుపయ్యంట యారజంబు | |
| గీ. | తోఁచుటే గాని మఱి యేమి తోఁచలేదు | రేయుఁబవలును మదనునిమాయ యేమొ వలపుఁ జెందుట కొఱగాదు నలువకైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 2 |
| సీ. | ఇంతైన నీ మాట కెదురాడకను నేను | నాతి! నీ మనసు రా నడవలేదొ? అలిగిన వేళల బలిమిగా వేడుచు | నీ యానఁ బాగాల నియ్యలేదొ? వలపువడ్డికిఁ బాఱ వద్దఁ జేరినవేళఁ | దెలిసి చెంతకుఁ జేరఁనీయలేదొ? కనుల నే యింతిని గనుఁగొన్న నీ సాటి | యగునొకో యని నిన్నుఁ బొగడలేదొ? | |
| గీ. | మమత దెలియనిదాని చందమున నిటుల | వేఱుసేయంగ నాయమా కీరవాణి! హరిహరీ! యీ గుణంబు మర్యాద గాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 3 |
| సీ. | హాయిగా నొక్కమాటాడకున్నావేమి? | చెలియరో! ముత్తెముల్ చిందునటవె? నెనరుగా నాదు మోమున మోముఁ జేర్చినఁ | దరుణి! నీ వాసికిఁ దక్కువటవె? చెలువుగా గబ్బిగుబ్బల ఱొమ్ముఁ గ్రుమ్మిన | ముదిత! నీ వన్నెకుఁ గొదువ యటవె? జతగూడి దొంతరరతుల నన్నేలినఁ | గలికి! నీ జాతికిఁ గడమ యటవె? | |
| గీ. | పలుకుమిఁక నీదు మదిలోని భావమెల్ల | నేలనే మది దాచేవు లోలనేత్ర! వలచినానని యెంచేవొ తెలిసెఁ దెలిసెఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 4 |
| సీ. | ముదితరో! నీ ముద్దుమోముఁ దప్పక చూచి | ముద్దిడ గమకించి మోము వంతు మగువరో! నీదు క్రొంజిగిమోవిఁ గనుఁగొని | యానఁగఁ దమకించి యౌడుఁ గఱతుఁ జెలియ! నీ గబ్బిగుబ్బల కాంతిఁ బరికించి | చెనకి పట్టఁగ నెంచి చే మడంతుఁ గలికి! నిన్ రతికేళిఁ గలయ నా మదిఁ గోరి | యొకటియుఁ దోఁచక యుస్సురందు | |
| గీ. | నిటుల వలచినవానిపై నించుకైనఁ | గరుణయుంచవు బలుదోసకారి మరుని పాలుచేసెదవో యింత జాలమేల? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 5 |
| సీ. | నా సామి నీవని నమ్మియున్నా నని | చిన్నెల వలపించి కొన్నినాళ్లు మన నేస్తములకు సమంబు లేదనిపింతు | వన్నెకాడా! యని కొన్నినాళ్లు మేను నీ సొమ్మని మెఱమెచ్చుకాడంచుఁ | గోరికల్ గల్పించి కొన్నినాళ్లు నీదాన నేనని నిశ్చయింపుమటంచు | నెన్నరాని విధానఁ గొన్నినాళ్లు | |
| గీ. | నాస పుట్టించి యిటుల యహర్నిశంబు | మనసుమర్మ మెఱుంగక మారుబారి పాలుసేయుట నాయమా పద్మనేత్ర? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 6 |
| సీ. | ఒకనాఁటివలెనె యిచ్చకపుమాటలచేత | దుద్దు వెట్టెదవేమె తోయజాక్షి! ఒకనాఁటివలెనె తప్పుపచారములు చేసి | ప్రొద్దు పుచ్చెదవేమె పూవుఁబోఁడి! ఒకనాఁటివలెనె నన్నొరగాఁ గనుఁగొని | జాగు చేసెదవేమె జలజగంధి! ఒకనాఁటివలెనె యూరక బాళి పుట్టించి | దక్కించెదవదేమె తక్కులాఁడి! | |
| గీ. | చాలుఁ జాలించు జూదాలు మేలుమేలు | మేలుదాన వటంచు నీ మేలు నమ్మి కోరినదె తక్కువయ్యెఁగాఁ గోమలాంగి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 7 |
| సీ. | మేలుదాన వటంచుఁ జాల నమ్మితిఁగాని | దోసకారి వటంచుఁ దోఁచదయ్యె దయదాన వంచుఁ జిత్తమున నెంచితిఁ గాని | నీ చుల్కఁదన మింత తోఁచదయ్యె నాదరింతు వటంచు ననుసరించితిఁ గాని | ద్రోహబుద్ధి వటంచుఁ దోఁచదయ్యె మమతదాన వటంచు మది నెంచితిని గాని | తొలుతనే నీ మట్టు తోఁచదయ్యె | |
| గీ. | నిలను మగవారు బలిమిగా వలచిరేని | యగడు గావించి యేఁచుట యాఁడువారి కపటవంచన నీవల్లఁ గంటిఁగంటిఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 8 |
| సీ. | బాళిచే నిన్నుఁ దప్పక చూచుచో ఱెప్ప- | పాటుపై నెంతో కోపంబుఁ దాల్తు అతివ! నీతో ముచ్చటాడువేళలఁ బ్రొద్దుఁ | గడుపు సోమార్కులఁ గంటగింతుఁ గలకంఠి! నిను బిగికౌఁగిట జేర్చుచోఁ | దారహారంబులఁ దప్పులెంతు నెమ్మెలాడి! నీదు క్రొమ్మోవి యానుచో | ముక్కముక్కరపైని మోడి సేతు | |
| గీ. | నిట్టి నా బాళి తెలియక యీ వితాన | జాల్జబాబులు చేసెదు చంద్రవదన! బలుమహాసామివైనావు నలువకైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 9 |
| సీ. | బలురంగు చెంగావిపావడ సవరించి | సరిగంచుచీర కుచ్చెలు బిగించి తులలేని కులుకుగుబ్బల సౌరు మీఱంగ | నెఱజాఱు పైఁట వేమఱుఁ జెలంగఁ జొక్కమౌ జవ్వాదిచుక్క ముద్దులుగుల్క | జీనిచక్కెరమోవి తేనెలొల్క యలరి ఘల్లని జిగియందియల్ మ్రోయంగ | నొఱపైన వింతవైఖరి చెలంగ | |
| గీ. | నీవు నా ముందఱను వచ్చి నిలిచినటులఁ | దోఁచుటే కాని మఱి యేమి తోఁచలేదు తెలియఁబల్కిన నా బాళి తెలిసికొనవు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 10 |
| సీ. | వలపింపరో చెలుల్ పిలవరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాఁడి? పిలిపింపరే చెలుల్ పిలువరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాఁడి? దక్కలేదో చెలు ల్దక్కరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాఁడి? వేఁడుకోరో చెలుల్ వేఁడరో మగవార- | లేలనే యీ మోడి యెమ్మెలాడి? | |
| గీ. | బాళిఁ జెందిన మగవారిపట్లఁ జెలులు | చుల్కఁగా నెంతురఁటె యిట్లు జలజనేత్ర! అయ్యయో! ఇంత యన్యాయమౌనె నీకుఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 11 |
| సీ. | ఏలనే నే తాళజాలనే యిఁకఁ జాలుఁ- | జాలునే కోపంబు జలజగంధి! వాదఁటే నెనరింత లేదఁటే మాటాడ- | రాదఁటే నాతోడ రాజవదన! వద్దటే నా చెల్మి వద్దటే నేరంబు | కద్దటే నాపైని ముద్దుగుమ్మ! మానవే యెంతటిదానవే కౌఁగిటఁ | బూనవే యీవేళఁ బూవుఁబోఁడి! | |
| గీ. | పూవుఁగోలలచే గాసిఁ బొందఁజాల | మాటిమాటికి నాపట్ల మర్మమేల ఏలనే బాల! యిఁక నిట్టి జాలమేల | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 12 |
| సీ. | ఒఱపైన ముద్దుక్రొమ్మెఱుఁగు కస్తురిచుక్క | ఘుమఘుమతావులు గ్రుమ్మరింపఁ బదివన్నెబంగారుపౌఁజుల కమ్మలు | మెఱుఁగుఁజక్కుల కాంతి మెఱయుచుండ రైక క్రిక్కిరిసి యారజపు సిబ్బెపుగుబ్బ | లరజాఱు పైఁటలో హౌసు మీఱ జిగికావి గల్గు క్రొంజిగురాకుమోవిపైఁ | దెలిడాలు నవ్వు వెన్నెలలు గాయ | |
| గీ. | సొలపుతో నీవు నాయొద్ద నిలిచినపుడె | యఖిలసామ్రాజ్యవైభవం బలరినట్లు తోఁచుచున్నది మదిలోనఁ దోయజాక్షి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 13 |
| సీ. | గజనిమ్మపండులఁ గాన్కలిచ్చెద గాని | కులుకుగుబ్బల ఱొమ్ముఁ గ్రుమ్మరాదె? కపురంపుఁ బల్కులు కాన్కలిచ్చెదఁ గాని | యొఱపుఁజెక్కిలి నొక్క నొసఁగరాదె? కండచక్కెర నీకుఁ గాన్కయిచ్చెదఁ గాని | యింతి! మోవిని నాననీయరాదె? కావలసినవెల్లఁ గాన్కలిచ్చెదఁ గాని | ప్రేమతో నొక ముద్దు పెట్టరాదె? | |
| గీ. | యిద్దఱికి బాళి సమమైన నింపు గలుగుఁ | గాక మగవాఁడు బలిమిగాఁ గాచి వలచి వచ్చినంతనె చులకనౌ వనితలకును | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 14 |
| సీ. | నిమిషమాత్రంబైన నిద్దురయే రాదు | నిలిచినచో మది నిలువనీదు అన్నంబు నోటికింతైనను రుచి కాదు | పొలఁతిరో క్షణమైనఁ బ్రొద్దుపోదు మాటాడ సైఁచదు మానవే యీ వాదు | తుదమొద లిట్లని తోఁచనీదు జాగొనరించుట బాగఁటే యిఁకమీఁద | సారెకు నీకిది మేరఁగాదు | |
| గీ. | రామరామ! యిఁకేమందు రాతిగుండె- | దాన వనుచును మనసున నే నెఱుంగ నైనఁ గానిమ్ము నినుఁ జూచినంత మనసు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 15 |
| సీ. | కలకంఠకంఠి! చక్కనివార లిల లేరొ, | బలిమిగా వేడినఁ దెలిసికొనరొ? కమలాక్షి! నీవలె గర్వించి యున్నారొ, | మేలుసెందుట లెంచి యేలుకొనరొ? పిలిచిన పలుకులు విని వద్దకును రారొ, | కూడి వీడరొ వీడి కూడుకొనరొ? తగురీతి నెపుడైన దయ సేయకున్నారొ, | తొలుతటి నెనరైనఁ దలఁచుకొనరొ? | |
| గీ. | చాలు నీవంటి నిర్దయురాలి నేను | గనియు వినియును గాన జగంబులోన నింక సైరింప దరమౌనె యిట్టులైనఁ? | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 16 |
| సీ. | వనిత! నీ మోముఁ జూచినవేళ యెట్టిదో | మఱి యే చెలిం జూడ మనసురాదు వనజాక్షి! నీవు పల్కినవేళ యెట్టిదో | యెవ్వరితోఁ బల్క నింపుగాదు చెలియ! నీ నెనరు చేసినవేళ యెట్టిదో | మఱచి యుండెదమన్న మఱపురాదు తెఱవ! నీతోడఁ బొందినవేళ యెట్టిదో | వద్ద నిన్ జూడక ప్రొద్దుపోదు | |
| గీ. | కటకటా! యింత భ్రమ గలఁ గమలభవుఁడు | వ్రాసినాఁడేమొ నిన్ను దూఱంగ మాకు న్యాయమౌనఁటె వినవె యన్యాయకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 17 |
| సీ. | వలచి పెనంగినవారిలో నావలె | బలిమిగా వేఁడినవారు లేరు చెలిమి చేసినయట్టి చెలులలో నీవలె | వంచన యొనరించువారు లేరు సారె మాలిమిసేయు సతిపతుల్ మనవలె | వాదులాడుచునున్నవారు లేరు కోరి చెల్మి యొనర్చువారిలో నిటువలె | బగఁబట్టి సాధించువారు లేరు | |
| గీ. | కలికి! నీయందె యిన్నియుఁ గంటి నేడు | నీదు మది నాదు భాగ్యంబు నేఁటికైన గారవింపుము దయయుంచి కీరవాణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 18 |
| సీ. | సొలపుఁ జూపుల నిన్నుఁ జూచినంతనె చాలు | నఖిలసౌభాగ్యంబు లబ్బినట్లు హాయిగా నొక్కమాటాడినంతనె చాలు | ఘనవైభవస్ఫూర్తి గలిగినట్లు ప్రేమతో నొకముద్దు వెట్టినంతనె చాలు | మఱి యింద్రభోగంబు దొరికినట్లు చెలిమిగా నొకసారి కలసినంతనె చాలు | నలరు బ్రహ్మానంద మబ్బినట్లు | |
| గీ. | చెలియ! వినుమని యిట్లు నేఁ బలికినాను | మరుని బారిని ద్రోయక మమత మీఱ గారవింపుము బిగువు బంగారుగాను | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 19 |
| సీ. | తరుణిరో! కడు దృష్టి దాఁకునో యని యెంచి | సొలసి నిన్ దప్పక చూడ వెఱతు వనిత! నీ నెమ్మేను వసివాడునో యని | కొంచక నినుఁ గౌఁగిలించ వెఱతుఁ గలికి! నీ నెమ్మోవి గసిగందునో యని | మిక్కిలి మొనపంట నొక్క వెఱతుఁ బడఁతిరో! నీవెంత బడలుదువో యని | బలిమి గాటపురతుల్ సలుప వెఱతు | |
| గీ. | తరుణి! నా బాళి తెలియనిదానివలెను | జాగొనర్చెదవేలనే నీ గుణంబు లింకఁ జాలింపు నను దయ నేలికొనుము | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 20 |
| సీ. | వలపు లిద్దఱికి దైవము కటాక్షంబుచే | నొనగూడెననుచుఁ బల్కిన వితంబు వలచి వేమాఱు నీ వద్దికి వచ్చెద | నలుగవద్దనుచు నీవనిన మాట నేను నీదాననై నెఱనమ్మియుండఁగా | సంశయమేల యంచనిన మేలు మన కిద్దఱకు నెనరొనఁగూడునే యిట్లు- | నని నీవు కడు మెచ్చుకొనిన వింత | |
| గీ. | మఱచి యేమియు మును గుఱుతెఱుఁగనట్టు | లెవరికో వచ్చినట్లేమి యెఱుఁగనట్లు నన్ను దయఁజూడవేమి యన్యాయకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 21 |
| సీ. | దయ మీఱఁగాను జెంతకుఁ జేరఁగాఁ దీసి | చెలిమి రంజిల్ల మచ్చికలు సేసి గమకించి యంతరంగము మెచ్చ మాటాడి | మక్కువఁ జేర రమ్మనుచుఁ బిలిచి వలసిన కోర్కు లవ్వారిగా మదిఁ గోరి | వచ్చిన యపుడెల్ల వద్ద జేరి సరిలేని రతుల నిచ్చలుఁ జాల నుబ్బించి | కపురంపుఁదాని బాగాలొసంగి | |
| గీ. | యెందు కిటువలె మనసిచ్చి యిప్పుడేమి | మనసు దెలియనివిధమున నెనరు దాఁచి మోసపుచ్చుట న్యాయమా, దోషకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 22 |
| సీ. | మాపురేపని వట్టి మాయలు చేసి న- | న్నలయింప న్యాయమా కులుకులాడి! కాని పోపొమ్మని లేని మాటలు పల్కి | జాగొనరింతురా చంద్రవదన! పదరవద్దని నీవు మొదట నమ్మికలిచ్చి | మఱచి యున్నావేమి మందయాన! నీదాన నేనని నిక్కమౌ దయవలెఁ | బొద్దు వోనిత్తురా ముద్దుగుమ్మ! | |
| గీ. | ఎందుకిటువలె నేఁచెద వెమ్మెలాఁడి! నీకు ఫలమేమి పల్కవే నేఁటికైనఁ గౌఁగిటఁ గదించి యేలవే కంబుకంఠి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 23 |
| సీ. | పున్నమచందురుఁ బోలు నీ నెమ్మోము | సొలయక తప్పక చూచిచూచి అందమైనట్టి నీ మందయానంబును | బలుమాఱు మదిలోనఁ దలఁచితలఁచి జిలిబిలి తేనెలు చిందు నీ పలుకుల | తక్కులకును చాల సొక్కిసొక్కి నలినాక్షి! నీ చిఱునవ్వు వెన్నెలదీవి | యేవేళ మదిలోన నెంచియెంచి | |
| గీ. | తిరిగి వేసారి వేసారి మరునిబారి | ఖిన్నుఁడైనంత నా యుసురున్న ఫలము నీకు నిఁకమీఁదఁ దెలియును నీరజాక్షి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 24 |
| సీ. | సొక్కుమ్రొక్కులు వింతచూపులు కొసరులు | సయిగలు ప్రేమలు దయలు పెంపు సన్నలు ముద్దులు చిన్నెలు వేసాలు | పరియాచకంబులు బంధగతులు చిఱుమమకారముల్ దురుసు పైసరములు | దొంతరముద్దులు వింత వగలు పావురాపల్కులు మోవికాటులు ప్రక్క | యణఁకువ మెలకువల్ గొణుగు తిట్లు | |
| గీ. | నమరఁగా జంటజక్కవలట్ల మనము | కౌఁగి లెడఁబాయకను వేడ్కగాను రతులఁ గూడుటెన్నఁడు పలుకవే కోమలాంగి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 25 |
| సీ. | ఎవుడు వత్తువొ యంచు నెదురెదురే చూచి | తలవాకిలిల్లుగా నిలిచినిలిచి యింతలో నెమ్మోము కొంత తప్పక చూచి | పొగడుచు నవ్వుచుఁ బొంగిపొంగి తిరిగి నీ నెమ్మోము దృష్టి తాఁకునటంచుఁ | బలుమాఱుఁ జూడఁగ నలికియలికి చూపు వెంబడి నిన్ను సుదతిరో! కానక | డెందంబులో దిగులొందియొంది | |
| గీ. | ఏమి సేయుదు దైవమా! యీ విధమునఁ | గొమ్మ దయ తప్పునో యని సొమ్మసిల్లి యలసి సొలసితి నసురుసురైతి నయయొ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 26 |
| సీ. | ఏ మాటలాడిన నేమి వచ్చునో యంచు | వేమాఱు మదిలోన వెఱపుతోను వెఱుపు నింకేటికిఁ దరుణి రమ్మనెనని | తగురీతియగు దిట్టతనముతోను మనపట్ల చెలియకు మనసు కద్దందునా | మోసమేమని కొంత యాసతోను బలిమిగా వేడినఁ జులకన యౌనని | కొద్దికొద్దిగ నంతపద్దుతోను | |
| గీ. | వెఱచి వెఱవక యాశించి మెఱవడిగను | నిన్నె మదిఁ గోరికోరి నే నిటులఁ జాల మోసపోతిని కటకటా దోసకారి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 27 |
| సీ. | మోము తప్పక నీవు ముదితరో చూచినఁ | జూపుతోఁబడి నన్నుఁ జూచిచూచి చూచిన హాయిచే నీ చకోరాక్షికి | బాళి కద్దని చాల బ్రమసి బ్రమసి బాళి కల్గెనటంచు బలిమిఁ జేసినయంత | మోసమౌనని చింత ముఁనిగి మునిఁగి చింతింపఁ బనియేమి యింతి నా సొమ్మని | యాసచే యోజనఁ జేసి చేసి | |
| గీ. | కలికి బూరుగుమానును గాచినట్టి | చిలుక విధమైతి నేను నీ చిత్తమింక నాదు భాగ్యంబు చల మిఁకమీఁద వలదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 28 |
| సీ. | ముదితరో! నీదు కెమ్మోవి యానకయున్నఁ | జీనిచక్కెరయైనఁ జేఁదుదోచు ముద్దుగుమ్మరో! నీదు మోముఁ జూడకయున్న | జుక్కలరాయనిఁ జూడఁబోను కులుకులాడిరో! నీదు పలుకులు వినకున్న | నేమియుఁ జెవులకు నింపుగాదు పణఁతి! నీ గబ్బిగుబ్బలను నొక్కకయున్న | గరములుండుట వృథగాఁ దలంతు | |
| గీ. | నిట్టి నా బాళి దెలియక యీ వితాన | రమణిరో! నీదు నెమ్మది రాయిచేసి యేల నన్ని టు వేఁచెద వెమ్మెలాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 29 |
| సీ. | సుదతిరో! నినుఁ జూచి సొక్కి యుండితిఁ గాని | హాయి మీఱగ ముచ్చటాడనైతి మోముఁ గన్గొని చాల మురియుచుంటిని గాన | ప్రేమతో నొక ముద్దు పెట్టనైతి నలరుమోవి యొకింత యాని సోలితిఁ గాని | చక్కఁగా మొనపంట నొక్కనైతి ముమ్మరంబగు నాస సొమ్మసిల్లితిఁ గాని | కళలంటి హాయిగాఁ గలయనైతి | |
| గీ. | గలికి! మదనుని మాయయౌఁ గాక నీదు | మోముఁ జూచిన వేళయో రామ రామ! ఇంత మోహంబు గలదఁటే యెవరికైనఁ? | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 30 |
| సీ. | అన్యాయకారి నిన్నాశించినది మొదల్ | నిజముగాఁ గంటికి నిదురరాదు దోసకారీ! నిన్నుఁ దొడరి కన్నది మొద- | లన్నంబు జిహ్వకు హాయి లేదు పాతకి! నీతోడఁ బల్కినయది మొద- | లెవరితోఁ బల్కఁగా నితవు గాదు ద్రోహి! నీ నమ్మిక లూహించినది మొదల్ | నిలిచినచోటనే నిలువనీదు | |
| గీ. | కటకటా! ఇంత భ్రమఁ జెందఁగా నొనర్చి | యేల వడిదుళ్ళఁ బెట్టెద వింకనైనఁ గలదు లేదని పల్కుము కంబుకంఠి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 31 |
| సీ. | పొరుగూరికిని బోయి మఱలి మా యింటికి | నెపుడు వత్తువొ పల్కు మెమ్మెకాఁడ! అధిగతాలస్యత నచట నుండితివేని | నేనెట్లు సైరింతు నీటుకాఁడ! ఇన్నాళ్ళకును వత్తు నిదియు నిశ్చయమంచు | వాఁడి నమ్మికలిమ్ము వన్నెకాఁడ! కన్నీటిజడిచేత నెన్నాళ్ళు తాళుదు | నతివేగిరముగ రమ్మందగాఁడ! | |
| గీ. | అనుచు నీ బాళి మనసులో నంతఁ దలఁచి | యెట్లు మఱతును మఱపురా దించుకైన బాళిఁ జెందితి నిను నమ్మి బేలనైతిఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 32 |
| సీ. | వనిత! సాంకేతికమునకు వత్తువొ యంచు | నాచుక రేయెల్లఁ గాచికాచి ఏల రాలేదో యా యెలనాగ యంచని | సొలయక దిక్కులు చూచిచూచి ఈ వేళకును రానిదేమొకో యని యుండ | లేక దిగ్గుమటంచు లేచిలేచి గల్లుగల్లున నదె కలికి వచ్చెనటంచు | నాసచే నిసుమంత యాచియాచి | |
| గీ. | యంత నరుణోదయంబైనయపుడు గుండె | జల్లుజల్లని పలుమాఱు తల్లడిల్లి సొక్కి సోలుట యా దైవ మొక్కఁ డెఱుఁగుఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 33 |
| సీ. | రవకుట్టుపని జంటిరైక క్రిక్కిరియంగ | బెళుకుసిబ్బెంపు గుబ్బలు వెలుంగఁ దావిచక్కెరమోవి ఠీవి ముద్దులు గుల్కఁ | దియ్యనిపలుకులఁ దేనె లొలుక నొయ్యనొయ్యన జిల్గుపయ్యెద యరజాఱ | సొగసు నెమ్మోమున నగవు దేర రంగుమెట్టెలరవల్ కంగుకంగని మ్రోయ | మదిలోని యాస వేమఱుఁ జెలంగ | |
| గీ. | కలికిరో! నీవు కన్నులఁ గట్టినట్లు | రేయుఁబవలును దోఁచు నింకే యుపాయ- మునను నీ మేలు మఱతునే వనజగంధి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 34 |
| సీ. | నా సామి యీ మేను నీ సొమ్ము నిజముగా | నిది నమ్మఁదగునందు నెమ్మెకాఁడ! ఎచ్చట నున్న నీ యింతి నే నంచని | నెమ్మదిగా నుండు నెమ్మెకాఁడ! నీకిష్టమగు కాంత నెనసినయప్పుడు | మమ్మెంతువేమి నీ వెమ్మెకాఁడ! నీవంటి రసికుని నేస్తంబు మదిలోన | నెట్లు నే మఱతురా యెమ్మెకాఁడ! | |
| గీ. | కరుణ మఱవకుమని నన్నుఁ గౌఁగిలించి | మోవి యానుచు దొంతర ముద్దులిడుట మఱపువచ్చునె వేయుజన్మములకైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 35 |
| సీ. | చాన! నీవెంత వంచన చేసినం గాని | నిను నేను విడనాడ నేర్తునటవె? రమణి! నీవెంత నిరాకరించినఁ గాని | మదిలోన నీ మేలు మఱతునటవె? అతివ! నీవెంత నన్నలయించినం గాని | యొక గడె నినుఁ జూడ కోర్తునటవె? తరుణి! నీవెంత దందన లొనర్చినఁ గాని | యిఁక నిన్నుఁ బాసి సహింతునటవె? | |
| గీ. | ఎన్ని జన్మములెత్తిన హితవు గాను | మగువరో! నీ వొనర్చిన మచ్చికలను మఱచెద నటన్న నింతైన మఱపు రాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 36 |
| సీ. | బాస లీయక చెల్మిచేసినయప్పుడే | కలకొద్ది నీ జాడ తెలిసెఁదెలిసె వద్దనె యుండ కవ్వలి కేఁగునప్పుడే | తొయ్యలి నీ జాడ దోఁచెఁదోఁచె దవ్వులనుండి దందనఁ జేసినప్పుడే | కలికి నీ తంటలు గంటిఁగంటిఁ జీటిమాటికి మోడి సేయుచున్నప్పుడే | కొద్దిగఁ గపటంబు కద్దుకద్దు | |
| గీ. | చాలుచాలింకఁ బలుమాటలేల తొలుత | దూర మెంచక వలచినదారి తెలిసి- తెలియని వితాన లోనైతిఁ గులుకులాడి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 37 |
| సీ. | వలపనే దెటువంటి వస్తువో యని యుంటి | బాలరో! యిన్ని దినాలనుండి మరులనే దేరీతిఁ బరఁగునో యని యుంటి | నిజముగాఁ దెలియక నేఁటివఱకు మోహమనే దెట్లు మొనయునో యని యుంటి | నాతిరో! నేఁ జిన్న నాఁటనుండి ఆస యనేదేమి చేసునో యని యుంటి | వనజాక్షి! జన్మ మొందినది మొదలు | |
| గీ. | వనితరో! యిట్టి నావంటివాని కిపుడు | వలపు నొలయించి యలయంచి సొలపు మించ నెందుకే చెలి! మీ దోసమేల నీకుఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 38 |
| సీ. | రేయెల్ల నిద్దురలేక యుండుటకును | గలకంఠి! నా కనులు సాక్షి మరుకాఁకచే స్రుక్కి కఱఁగిన యందుకు | దరలాయతాక్షి! నా తనువు సాక్షి మరులు తాళఁగలేక పొరలినయందుకు | బడఁతి! నేఁ బవళించు పాన్పు సాక్షి ఒంటిగా నినుఁ బాసి యోర్చినయందుకు | నీ వగ వలయించు నీవె సాక్షి | |
| గీ. | వలపుచే ముందు తోఁచక బలిమిగాను | నిన్ను మఱి వేడుకొనుటకు నేనె సాక్షి సాక్షు లిఁక వేయునేటికి సారసాక్షి? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 39 |
| సీ. | ఆటలకైన నీ వలిగియుండితివేని | గుండె జల్లని కొట్టుకొను నదేమొ? పరిహాసమునకైనఁ బలుకకుండితివేని | మిన్ను పైఁబడినట్టు లుండునేమొ? ఊరకయైన మోమోర చేసితివేని | మించిన మది తల్లడించునేమొ? నవ్వులకైనను నొవ్వనాడితివేని | జెల్లఁబో మై సొమ్మసిల్లునేమొ? | |
| గీ. | ఇంతి వలపని సొలపని యెఱుఁగనట్టి | నన్ను వలవైచి దక్కించి యిన్ని వెతల కిమ్ము చేసితి వా మాట లింకనేల? | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 40 |
| సీ. | వారి వీరి వితాన నూరక యుండక | చెలియ! నీ మోముఁ జూచినదె తప్పు మనకేల యని యెంచి మాటల నిల్వక | లేమ! నీ తోడఁ బల్కినదె తప్పు వరులయ ట్లందంద పరికించి మెలఁగక | ననబోఁడి! నిన్నుఁ జేరినదె తప్పు తగురీతిగా దవ్వుదవ్వుల మెలఁగక | లేమ! నిన్ రతుల నేలినదె తప్పు | |
| గీ. | తప్పు లీరీతి నుండఁగాఁ దరుణి! నాదు | తప్పులు గణింపవలెనన్నఁ దక్కువేమి? ధాత వ్రాసిన వ్రాతకే తప్పు గలదె! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 41 |
| సీ. | ఎప్పటిరీతిగా హితవుగ మాటాడ- | విదియేమి కపటమే యెమ్మెలాఁడి? సరసఁ జేరినవేళఁ జల్లఁగా ననుఁ జూడ- | వెవ్వరిబోధనే యెమ్మెలాఁడి? చనువీయకయె నన్ను జాడఁ జేసెద విప్పు- | డెవ్వరిపై బాళి యెమ్మెలాఁడి? దవ్వులనుండి దందన లొనర్చెదవేమి | యీ గుణం బేడదే యెమ్మెలాడి? | |
| గీ. | తొలుత వలవేసి దక్కింపవలసి మదిని | వలపు గలిగినరీతిగాఁ జెలిమి చేసి దక్కెనని నన్ను నేఁచేవు తక్కులాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 42 |
| సీ. | నినుఁ బాసి నిముసంబు నేఁ దాళనందువే | చాన నేఁడా బాళి కానదేమి? అరగడె రాకున్న నపుడె రప్పింతువే | కలికి! నేఁడా జాడ గానదేమి? సరసంబులకుఁ బ్రొద్దు చాలలేదందువే | కాంత! నేఁడా మాట కానదేమి? కనుఱెప్ప వెట్టక ననుఁ జూచుచుందువే | గరిత! నేఁడా ప్రేమ కానదేమి? | |
| గీ. | ఎవనిపై బాళి జనియించె నిట్లు సేయ | నెవఁడు నినుఁ గాంచె నీ మోహ మెచట మించె నింక దాచక పలుకవే యెమ్మెలాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 43 |
| సీ. | పదియాఱుకళల నింపొదవు పున్నమనాఁడు | మించి చందురుఁ డుదయించినట్లు తొలిజన్మమునఁ జేయు ఫలము రూపముఁ దాల్పు | హాయిగా బ్రత్యక్షమైనయట్లు చెందరాని ప్రయాసఁ జెందియు నెందునా | దొరకని పెన్నిధి దొరికినట్లు వెల యింత యంతని కొలఁది వెట్టగరాని | యనుపమంబగు రత్నమబ్బినట్లు | |
| గీ. | నిన్నుఁ జూచినయప్పుడే నెమ్మనమున | నెంచుకొనియుందు నటువంటి నెనరుఁ బాసి మారుబారికిఁ ద్రోఁచెదో నీరజాక్షి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 44 |
| సీ. | గబ్బిగుబ్బ లురంబుఁ గదియ నానింపుచు | హెచ్చి కౌగిటఁ గదియించు వింత తనువు జల్లుమనంగఁ దమక ముప్పొంగఁగాఁ | జెక్కిలి కొనగోట నొక్కు వింత కసిదీర మొనపంట గంటి సేయుచు మోవి | నిండార నాని యానించు వింత తమి యగ్గలంబుగాఁ దలిరువిల్తునికేళి | యింపు మీఱఁగ దనియించు వింత | |
| గీ. | నీకుఁ దగుఁ గాక మఱి వేఱు నెలఁతలకును | గలుగ నేర్చునె నీవంటి కంబుకంఠి చెలిమి గల్గుట తొలిజన్మఫలము సుమ్మి, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 45 |
| సీ. | సామి రారా యను నీ ముద్దుమాటల | పిలిచిన నెఱహాయిఁ దలఁచి తలఁచి నిమిషంబు రాకున్న నెలఁతలచే నన్ను | బలిమి రప్పించుటఁ దలఁచి తలఁచి యేవేళ నా రాక కెదురెదురె చూచి | నిలచి కోరెడు బాళిఁ దలఁచి తలఁచి యరనిముషంబు నే నలుక గా నుండిఁన | బలుమాఱు వేఁడుటఁ దలఁచి తలఁచి | |
| గీ. | చెలియరో నిన్న నీవు నా చెంతలేక | యున్న నే ప్రొద్దుఁ బుచ్చితి నొకవితాన నేడు కన్నులు చల్లగా నిన్నుఁ గంటి, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 46 |
| సీ. | తనివిఁ జెందదదేమొ తరుణిరో! నీ మోవి | పానకంబెంతయు నానుచున్న గసటు పుట్టదదేమొ కలికిరో! నీతోడఁ | గూడి రేపగలు మాటాడుచున్న వెగటుఁ జెందదదేమో వెలఁది నీ చెక్కిలి | నెన్ని మారులు ముద్దులిచ్చుచున్న బ్రొడ్డు చాలదదేమొ పొలఁతిరో! నినుఁ జేరి | పలుమారు మరుకేళిఁ గలయుచున్న | |
| గీ. | నీదు మొగమోటమియొ లేక నీరజాస్త్రు | మాయయొ యెఱుంగరాదిది తోయజాక్షి యింత మాలిమి సేయరా దెవరికైనఁ, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 47 |
| సీ. | కలలోననైన నిన్గలవరించుటె కాని | తొయ్యలి మఱియేమి తోఁచలేదు మాటమాటకు నీదు మాటలాడుటె కాని | యితరంబు పలుకుట కింపుగాదు తలఁచుటన్నియు నీదు సొలపు చిన్నెలె గాని | మఱియేమి తలఁపంగ మనసురాదు చూచుటెల్లను నిన్నుఁ జూడఁగోరుటె గాని | చూడ్కులు మఱియొండు చూడనీవు | |
| గీ. | కటకటా! యింత బ్రమయించు కారణమున | కేమి వల వేసితో గదే యిందువదన! నీకుఁ దక్కితి సొక్కితి నిజముగాను, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 48 |
| సీ. | హాయిగా నీ మోవి యాని సొక్కకయున్న | జిహ్వకు ఫలమేమి చిగుఱుఁబోణి! కటకటా నిన్నుఁ గౌఁగిట గదింపకయున్నఁ | దనువుకు ఫలమేమి దంతిగమన! అందమౌ నీ మాట లాలకింపకయున్నఁ | జెవులకు ఫలమేమి చిన్నెలాడి! సొంపు దేరెడు నీదు కులుకుఁ జూడకయున్న | జూడ్కికి ఫలమేమి సుందరాంగి! | |
| గీ. | ఐన నీవంటి చెలిఁ నవనిలోన | మగువరో! యిది మదనుని మంత్రమొక్కొ కాక యీ వింత గలదె యే లోకమందు? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 49 |
| సీ. | పలుమాఱు ముద్దులు గులుకు నీ నెమ్మోము | సొలపులు చక్కఁగాఁ జూడనైతి, నందంద తేనెలు చిందు నీ కెమ్మోవి | హాయిగాఁ గసి దీఱ నాననైతి, జిరుతసిబ్బెపు మిణ్కుచెణుకులఁ బొదలు నీ | నునుచనుల్ తనివార నొక్కనైతి, మదికి బ్రహ్మానంద మొదవించు నీతోడ | నెనసి కోరిక తీరఁ బెసఁగనైతిఁ, | |
| గీ. | గటకటా! ఇట్టి ననుఁ జూచి కరుణ లేక | యెవ్వరే పగ సాధించి యించువిల్తు బారిఁ ద్రోసెదరో యేమి పలుకుమింకఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 50 |
| సీ. | నిమిష మాత్రంబైన నిన్నుఁ జూడకయున్న | మనసోర్చి నే తాళననఁగలేదొ? ఒకవేళ నేనొకించుక కోపగించిన | వేమఱు బలిమిగా వేఁడలేదొ? మన నేస్తమునకు సమానంబు లేదని | యప్పటప్పటికి నీ వనగఁ లేదొ? ఎవరైన నామాట నిసుమంత దూఱినఁ | గెరలి వారలఁ గోపగించలేదొ? | |
| గీ. | అట్టి నీ చిత్తమునకు నేఁ డలుక దోఁచి | గారవించక నీ వృథా నేర మెంచి యీ విధంబున నేఁచ నే నెట్టులోర్తు, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 51 |
| సీ. | ఎడఁబాయవంచు నిన్నిచ్చగించితిఁ గాని | పలుకకుందువటంచుఁ దలఁపనైతి వలపు దాఁచవటంచుఁ జెలిమిచేసితిఁ గాని | యలుక సేతువటంచుఁ దెలియనైతి విడనాడవంచు నే విశ్వసించితిఁ గాని | వంచన గావించుటెంచనైతి నెనరుదాన వటంచు నెఱ నమ్మితిని గాని | యెంచి నీ గుణము భావించనైతి | |
| గీ. | దూరమెంచక నా సరివారిలోన | ఆరుదూఱైతి నిన్నిఁక దూఱనేల నన్ను నేననుకోవలె నళినగంధి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 52 |
| సీ. | అలుక సేతురు గాని యతివరో! నీవలెఁ | బలుమాఱు నలిగెడి పడఁతి గలదె? చలమొనర్తురు గాని జలజాక్షి నీవలెఁ | బగ వట్టి సాధించు మగువ గలదె? నేరమెంతురు గాని నెలఁతరో నీవలెఁ | బలుచనగాఁ జూచు చెలువ గలదె? పలుకకుందురు గాని భామరో! నీవలె | మిన్నక విడనాడు మెలఁత గలదె? | |
| గీ. | నీదు కపటంబు తెలియక నేను వలచి | కోరి చేరినయందు కీ దారి నన్ను మాటిమాటికి నేఁచెదో మంజువాణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 53 |
| సీ. | పలుమాఱుఁ బిలిచినఁ జలము సాధింపుచు | నూరక మాటాడకుండుటేమి? ఎదుట నిల్చినఁ గాని యెంతయు దయ లేక | నేఁచఁగఁ జురచురఁ జూచుటేమి? బలిమిగా నేనెంత ప్రార్థించినం గాని | చెలియరో! మోమోర సేయుటేమి? చేర రమ్మని నేను సారెసారెకుఁ బిల్వఁ | జూడఁజూడఁగ విడనాడుటేమి? | |
| గీ. | ఇంత నిర్దయురాల వంచించుకైన | మొదటఁ దోఁచక నే వృథా మోసపోతి నింక నీ మాట లేటికే యిందువదన? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 54 |
| సీ. | చలపట్టి యెవరెంత చాడి చెప్పినఁ గాని | చెలియరో! దయ మఱచెదవు సుమ్మి ఏ వేడుకలయందు నీవు నెమ్మది సొక్కి | చెలియరో! దయ మఱచెదవు సుమ్మి తగు చిన్ననాఁటినేస్తము గదా యిది యంచుఁ | జెలియరో! దయ మఱచెదవు సుమ్మి నేరక నేఁ జేయు నేరంబులఁ దలంచి | చెలియరో! దయ మఱచెదవు సుమ్మి | |
| గీ. | మనసు మర్మంబులిచ్చి ప్రేమంబు హెచ్చి | చెలిమి చేసిన దయ మఱచెదవు సుమ్మి మరలి నే వచ్చునందాఁక మందయాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 55 |
| సీ. | కినుకచే నిన్నుఁ గన్గొనక యుండెదనన్న | నువిదరో! నా చూడ్కు లుండనీవు పద్దుచే నీతోడఁ బలుకకుండెదనన్నఁ | జెలియ! నా పలుకులు నిలువనీవు బిగువుచే నీ మాట వినక యుండెదనన్న | నింతి! నా చెవులందు కియ్యకొనదు కలఁకచే నిను మదిఁ దలఁపకుండెదనన్న | నెలఁతరో! నా యెద నిలువనీదు | |
| గీ. | ఇంత భ్రమ పుట్టఁగాఁ జేయ నించువింటి- | దంట యొనరించు మటుమాయతంటలకును బాల! నీ వలలోఁ జిక్కి బేలనైతిఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 56 |
| సీ. | ఇన్నాళ్ళలోన నేనెందఱు చెలలతో | నతిదయ మీఱ మాటాడలేదు మాటలాడుట గాక మనసు మర్మములిచ్చి | చెలిమితో మచ్చిక సేయలేదు మచ్చికల్ గావించి మనసార రేపవల్ | వీడని కౌఁగిళ్ళఁ గూడలేదు కౌఁగిటి నెనసి నిక్కపుదయ మీఱంగఁ | దలిరువిల్తునికేళిఁ దనియలేదు | |
| గీ. | హాయి నీవలె వలనేసి యాసగొల్పి | నన్నుఁ దక్కించుకొన్నట్టి వన్నెలాడి నెందుఁ గాననే చాన! నే నిట్టులైనఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 57 |
| సీ. | మోహనాంగిరొ! నీదు మోముఁ జూడకయున్న | నిముసంబు యుగమయ్యె నేమిసేతు? మదిరాక్షి! నీతోను మాటలాడకయున్న | నెదఁ బట్టినట్లయ్యె నేమినేతుఁ? జిగురుఁబోణిరొ! నీదు చెంతఁ జేరకయున్న | నెదయు నింపుగా దేమిసేతుఁ? గాంతామణిరొ! నిన్నుఁ గలసి కూడకయున్న | నితరంబు దోఁచ దింకేమిసేతు? | |
| గీ. | నింత వలచుట తగునఁటే యిందువదన! | తొలుత నీతోడ మతిలేక చెలిమిఁ జేసి యలరువిల్కాని బాళి పాలైతిఁ గదవె | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 58 |
| సీ. | ఊరక యుండక వారిజాక్షిరొ! నీదు | సొలపులు చిన్నెలు చూడనేల? చూచినంతయుఁ గాక శుకవాణి! నీ చెంతఁ | జేర నెమ్మదిలోనఁ గోరనేల? కోరినంతయె కాక కొమ్మరో! యిరువుర | మతిదయ మీఱ మాటాడనేల? మాటలాడుట గాక మగువరో! నీతోడ | హాయిమీరఁగఁ జెల్మి సేయనేల? | |
| గీ. | కంతుఁ డీరీతి నొనరించి పంతగించి | విరహమునఁ గుందఁగాఁ జేసె వేయునేల? ధాత వ్రాసిన వ్రాతకు దప్పుగలదె? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 59 |
| సీ. | నీదు చొక్కపుమాట నీదు చల్లనిపాట | నీ వింతసయ్యా ట నీదు తేట నీదు యొయారంబు నీదు గంభీరంబు | నీదు తిన్నఁదనంబు నీదు గుణము నీ యొయారపుఁజూపు నీ వింతతరితీపు | నీదు చక్కనిరూపు నీదు వైపు నీ నడకలబెళ్కు నీదు గుబ్బలతళ్కు | నీదు చిలుకపల్కు నీదు కుల్కు | |
| గీ. | నిలను నీవలెఁ జెలులకుఁ గలిగెనేని | నిన్నె మదిలోన నాసించి నెనరుమించి మోసపోదునె నేనిట్లు దోసకారి? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 60 |
| సీ. | వలవు రెట్టించి నే బలిమిగా వేఁడుట | తలఁతువో తలఁచవో కులుకులాడి! ఆసించి నిన్ను నే ననుసరించుట నీకుఁ | దోఁచునో తోఁచదో తోయజాక్షి! బాళి నిలుపలేక బలువెత సెందుట | తెలుతువో తెలియవో కంబుకంఠి! అందరిలో వృథా యారుదూరైనది | యెంతువో యెంచవో యిగురుఁబోణి! | |
| గీ. | కటకటా! యింత యన్యాయకారివనుచు | నింత తోఁచక నిన్ను నే నిచ్చగించి మోసపోయితి నయ్యయో దోసకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 61 |
| సీ. | పలుమాఱు వట్టిమాటలను బ్రేలించేవు | తీరునా విరహాగ్ని దీనిచేత? మనసీయ కొకజాడ మాటగాఁ బలికేవు | మానునా మరుబాళి దానిచేత? నలయించి వింతచిన్నెలను దేలించేవు | హితమని తోచునా యిందుచేతఁ? గపటవృత్తికిఁ జొచ్చి కాంక్ష వెచ్చించేపు | హాయి చేకూరునా యందుచేత? | |
| గీ. | నన్ని దెలిసియుఁ దెలియనియట్లు నీవు | జాగు సేయుచునున్నావు నీ గుణంబు తోఁచియును దోఁచకుండెడి దోసమొక్కొ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 62 |
| సీ. | నీరజాక్షిరొ! యరనిముసమే యుగమాయెఁ | జిలుకల పలుకులు ములుకులాయెఁ బలుమాఱు మదిలోనఁ గలఁక యగ్గలమాయె | వెలఁది! పూవులతావి వేండ్రమాయె నందరిలో వృథా యాడికల్ ఘనమాయె | యోచనలేమియుఁ దోఁచవాయె జెలికాండ్రలోన మిక్కిలి యారుదూరాయె | వెలఁది! నీ గుణములు వింతలాయె | |
| గీ. | నురమునను దూయ మరుఁ డురుశరము లేయఁ | దోడు కోయిల గూయఁ జందురుఁడు గాయ హరిహరీ హరి యననాయె మరుని మాయ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 63 |
| సీ. | ఇదె యిదె యనుచు నన్నేఁచెదవే కాని | హాయిగా నొక్కమాటాడవేమి? రేపుమాపని బాళి రేఁచెదవే గాని | హితవుగా నీ మనసీయవేమి? యారుదూరొనరించి యలయించెదే కాని | యించుకైనను కరుణించవేమి? తగవు మీఱఁగ వట్టివగలు చేసెదు కాని | బిగికౌగిలింతలఁ బెనఁగవేమి? | |
| గీ. | ఎంత కన్నడ లెంతటి జంతతనము లెంత | జాలము లెంతటి వింతచిన్నె లౌనె నీవంటి జాణ యెందైనఁ గలదె! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 64 |
| సీ. | కన్నాతలాగించి కౌఁగిట బిగియించి | మోము మోమునఁ జేర్చి ముద్దులిచ్చి తొడతొడయును గ్రుమ్మి యెడసూయకయె నెమ్మి | కులుకు గుబ్బలఁ గ్రుమ్మి గోటఁ జిమ్మి తోరమౌ కసిఁబూని తోఁపునూకులనాని | సరిమోపులాని వైఖరులఁబూని యెదురొత్తులొత్తి పన్నిదపుఁ బైసరమెత్తి | కంతుని మదహస్తికరణి హత్తి | |
| గీ. | ప్రక్కమార్పులఁ దేలించి బాళిమించి దక్కదక్కించి | వింతవింతగ రమించి గారవించుము వేగమె కరుణయుంచి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 65 |
| సీ. | ఎంతైన నీ మాట నెదురాడకయ నేను | నాతి! నీ మనసురా నడవలేదొ? అలిగినవేళ నిన్ బలిమిమై వేఁడుచు | నొయ్యనఁ దాంబూల మియ్యలేదొ? వలపు మీఱఁగ వాదు సలిపినవేళను | నెయ్యముతోఁ జేరఁదీయలేదొ? కన్నులు విచ్చి నిన్గనుఁగొని నీ సాటి | మగువలు లేరని పొగడలేదొ? | |
| గీ. | మమత దెలియనిదాని చందమున నిట్లు | వేఱుసేయంగ నౌనఁటే కీరవాణి! అరయ కిటు వేఁచ నీకు మర్యాదగాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 66 |
| సీ. | హాయిగా నొక్కమాటాడినంతనె చాలు | చెలియరో! ముత్యముల్ చిందునటవె? మొనసి నీ మోమున మోము చేర్చినయంత | తరుణి! నీ వాసికి తగ్గునటవె? బలిమిగా గుబ్బిగుబ్బల నాననిచ్చిన | ముదిత! నీ వన్నెకు మోసమటవె? జతగూడి దొంతరరతుల దేలినయంత | కలికి! నీ జాతికిఁ గడమ యటవె? | |
| గీ. | పలుకవే నీదు గోర్కె నీ భావమెల్ల | నేలనే యింత దాఁచెదు లోలనేత్ర, వలసినాఁడని యేఁచెదు తెలిసి తెలిసి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 67 |
| సీ. | ముదితరో! నీ ముద్దుమోముఁ దప్పక చూచి | ముద్దిడ గమకించి మోము వంచి మగువరో! నీదు క్రొంజిగిమోవిఁ గనుఁగొని | యానంగఁ దమకించి యంత వెఱచి పడఁతి! నీ గబ్బిగుబ్బలఠీవి పరికించి | కడఁగి పట్టఁగ నెంచి కరముఁ దిగిచి కలికి! నిన్ రతికేళి గలయ నెమ్మదిఁ గోరి | యొకటియుఁ దోఁచక యుస్సురంచు | |
| గీ. | నిటుల వలఁచినవానిపై నీ వితాన | కరుణ యుంచకయే దోసకారి! మరుని పాలు గావించెదవొ యింత జాలమేల | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 68 |
| సీ. | నా సామిగా నిన్నె నమ్మియున్నానని | చిన్నెలు పచరించి కొన్నినాళ్ళు నీదాన నేనని నిక్కమెంచు మటంచుఁ | గూర్చి ప్రియంబునఁ గొన్నినాళ్ళు మన నేస్తమునకు సమంబులే దరసిన | వన్నెకాడ వటంచుఁ గొన్నినాళ్ళు మేను నీ సొమ్మని మెఱమెచ్చు లాడించి | కోరిక హెచ్చించి కొన్నినాళ్ళు | |
| గీ. | లాస పుట్టింప నిట్టు లహర్నిశంబు | మనసు మర్మ మెఱుంగక మరులుకొంటి మాయ హత్తించి యేతుఁరా తోయజాక్షి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 69 |
| సీ. | ఒకనాఁటివలెనె యిచ్చకపు మాటలచేత | మందుఁ బెట్టెదవేమె మందయాన! ఒకనాఁటివలె వట్టి యుపచారములు చేసి | ప్రొద్దుపుచ్చెదవేమె ముద్దుగుమ్మ! ఒకనాఁటివలెనె నన్నొరుని గాఁగను జూచి | జాగుచేసెదవేమె చంద్రవదన! ఒకనాఁటివలెనె నాకొక బాళిఁ బుట్టించి | దక్కి దక్కవదేమె తక్కులాఁడి! | |
| గీ. | చాలు చాలించు నిఁక జాలు చాలు మేలు- | దాన వంచును నెమ్మదిలోన మిగులఁ కోరినది తక్కులాయెగాఁ గోమలాంగి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 70 |
| సీ. | మేలుదాన వటంచుఁ జాల నమ్మితిఁ గాని | దోసకారివటంచుఁ దోఁచదాయె నీ చెల్మి సతమని తోఁచి యుండితిఁ గాని | తొలుత నేనిట్లౌట దోఁచదాయె మమతదాన వటంచు మదిని నమ్మితిఁ గాని | యేఁచుదానవటంచుఁ దోఁచదాయె నాదరింతు వటంచు ననుసరించితిఁ గాని | ద్రోహబుద్ధి వటంచుఁ దోఁచదాయె | |
| గీ. | నిలను మగవారు బలిమిగా వలచిరేని | యసదు గావించి యేఁచెడు నాఁడువారి కపటమెల్లను నీవల్లఁ గంటిఁ గంటి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 71 |
| సీ. | సొగసు నీరజము నెమ్మొగమును గావించి | కలువరేకులు నేర్చి కనులొనర్చి మురువైన తలిరుతో మోవి సొంపొనరించి | పలుకు లమృతముతోఁ బదనుఁజేసి కులుకుబంగరుగిండ్లు గుబ్బలు గైసేసి | యరఁటులతోఁ దొడ లందపఱిచి పద్మరాగములతోఁ బదముల నొనరించి | మేనెల్ల బంగారుతోను బొదివి | |
| గీ. | తమ్మిరాచూలి నీ నెమ్మనమ్ము చట్టు | రాతిఁ జేసెనొ కాని పురాతనమున గారవించవె వేగమె కలువకంటి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 72 |
| సీ. | చొక్కంపు నీ ముద్దుచక్కెరకెమ్మోవి | యొఱుపు గావించి నోరూరియూరి మినుకు నిబ్బెపుపొడల్ గనుపట్టు నీ చనుల్ | మాటికిఁ బెనుగోట మీటిమీటి పలుచనైనట్టి నీ పాల్గారు చెక్కులు | నొక్కంగఁ గరముల నొగ్గియొగ్గి మురువైనయట్టి నీ మోమున నా మోము | తనివి దీరఁగఁ బూన్పఁ దలఁచితలఁచి | |
| గీ. | కోరికలు వడ్డికిని బాఱఁ గొంకు దీరి | యెపుడు పైకొందునో యని యెంచియెంచి యున్న ననుఁ బ్రోవు మింక నే నోర్వగలనె? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 73 |
| సీ. | అవనిలో మొగపుట్టు వగుచుఁ బుట్టగరాదు | పుట్టిన రసికుఁడై పొదలరాదు పొదలిన నొక్కతె పొందు గోరగరాదు | గోరిన బాళిచేఁ గొసరరాదు కొసరిన దయలేని కూటమి గారాదు | కూటమి గలిగినఁ గొంకరాదు కొంకు గల్గిననేమి కూడి వీడఁగరాదు | వీడిన మది విడనాడరాదు | |
| గీ. | వలఁచి వలపించుకొనునట్టివారు లేరొ | యైన నీ గుండె రాతితో నబ్జభవుఁడు చేసినాఁడేమొ హరిహరీ దోసకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 74 |
| సీ. | ముద్దాడితే నిన్ను మోహమెల్లను దీరు | ముదిత! నీ మోమున మోము నిల్పి గదియఁ బట్టిన నాదు కలఁక యెల్లను తీరు | కలికి! నీ సిబ్బెపుగబ్బిచనులు కౌఁగిలించిన నాదు కాఁక యెల్లను దీరు | పూని నీ మేను నా మేను జేర్చి కూడి యేలినఁగదా కోర్కులెల్లను దీరు | నెనరున పైకొని నిన్నుఁ గలసి | |
| గీ. | యతివ! యిటువంటి మాటలే యనుదినంబు | బలుకుచును ప్రొద్దుపుచ్చిన తులువమరుని రాపు నెటువలె నోర్తు పరాకు వలదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 75 |
| సీ. | మనసు రంజిల్లఁగా నెనరుచే నొకసారి | మొగమెత్తి చూడవే ముద్దుగుమ్మ! వీనులవిందుగా వినియెద చల్లగా | మాఱుమాటాడవే మందగమన! కోపించుమదనుని తాపమారును గాని | మోవి నానెద నిమ్ము మోహనాంగి! కోరినకోర్కి చేకూరంగ నీవేళ | బిగికౌఁగిలీయవే చిగురుఁబోణి! | |
| గీ. | యెంత నిర్దయురాలవే యీ విధమున | చలము చేయుట న్యాయమా చంద్రవదన! యానఁబెట్టి గదా యింత మోసపోతి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 76 |
| సీ. | పూర్ణచంద్రుని నేను బూజించినందుకు | సొగసైన నీ మోముఁ జూడఁగలిగె నతనుబంట్లకుఁ జిగురాకు నిచ్చుకతాన | సుదతిరో! నీ మోవిఁ జూడగల్గెఁ జిలుకలకును శిక్షఁ జెప్పి పెంచితి గాన | లేమ! నీ పలుకు లాలింపఁగలిగె వెన్నెలబైట పూవిల్తుఁ గొల్చుటచేత | మెలఁత! నీ చిఱునవ్వు మెచ్చఁగలిగె | |
| గీ. | నన్ని యిటవలెఁ జేకూడినందు కిపుడు | బాలరో! నిన్ను మరుకేళి నేలవలదె? ఏలనే జాగుచేసెదు లోలనేత్ర! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 77 |
| సీ. | వలచితినని యెంచి వడిసుళ్ళఁ బెట్టెదు | మర్యాదయటె నీకు మందగమన! బలిమిఁ గోరితినంచుఁ జులుకగాఁ జూచెదు | న్యాయమటె నీకుఁ దోయజాక్షి! వేఁడవేఁడఁగ నన్ను వేఱుగాఁ జూచెదు | ఘనమటే నీకు బంగారుబొమ్మ! యనుసరించెదనంచు ననుఁ జౌక జేసెదు | తగుదునటే నీకిది చిగురుఁబోఁడి! | |
| గీ. | ఇంత యైందనఁ గలదటే యెమ్మెలాఁడి! | మర్మ మెఱుఁగనిదానవె మంజువాణి! వలదు వలదిఁకఁ జాల్చాలుఁ గులుకులాఁడి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 78 |
| సీ. | బలులేమిచే సిగ్గుపడియెడువానికి | దుర్గాధిపత్యంబు దొరకినట్లు అరుచిచే వెతఁ జెందునట్లైనవానికి | నమృతరసాయనం బబ్బినట్లు కలనైన నొకరూక గాననివానికి | కలితకాంచనరాశి గలిగినట్లు ఘనచింత యను వార్ధి మునిఁగినవానికి | మదికి బ్రహ్మానంద మొదవినటుల | |
| గీ. | నతివ! నీవంటి చెలి గుబ్బలంటి మోవి- | యాని కౌఁగిట గదియించి యతనుకేళి గలియుటే చాలు నీ వింకఁ గాదటన్న | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 79 |
| సీ. | మనసు దాఁచక నీవు మాటాడనెంచిన | నతిన! నీ గుణము మాటాడనియదొ దయఁ జూడ నామీఁదఁ దలఁచినంతనె నీదు | దందనంబును దయఁ దలఁచనీదొ ఇంచుక కనికరం బుంచఁజూచిన నీదు | వంచన కనికరం బుంచనీదొ నెనరుసేయఁగఁ బూనుకొనిన నీ కపటంబు | హాయిగా నెనరిందు సేయనీదొ | |
| గీ. | ఇట్టి గుణములు దందన లిట్టి హెచ్చు | వంచనయుఁ గపటంబును వసుధలోన నిందువదనరో! యెవ్వరియందుఁ గాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 80 |
| సీ. | బాళి నిల్పఁగలేక పలుమాఱు వేడితే | దక్కువ లెంచేవు తలిరుబోడి! మరుబారి కోర్వక మనవి గావించితే | వంచనఁ జేసేవు వన్నెలాడి! వలపుమించిన నేను బలిమి ప్రార్థించితే | జులుకఁగాఁ జూచేవు కులుకులాడి! మనసుఁ బట్టగలేక మఱిమఱి వేఁడితే | జౌకఁగాఁ దలచేవు చంద్రవదన! | |
| గీ. | యందులకు నేమి యెటువలెనైనఁ గాని | కినుక నొనరింతురా నీవె నెనరుసేసి నన్నుఁ గైకొమ్ము నీవని నమ్మినాఁడ | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 81 |
| సీ. | నేరిచి నడిచిన నేరక నడిచిన | గరుణించి సోఁకోర్చి గావఁగలవు మన్ననఁ జేసిన మర్మంబు దాఁచిన | వినుము వెయ్యేల నా ఘనత నీవె నేరంబు లెంచిన నెనరు గావించిన | యెటులైనఁ గీర్తి వహింపఁగలవు మిత్రతనైన నమిత్రత్వముననైన | మఱియు నా తాపంబు మాన్పఁగలవు | |
| గీ. | మనసులోపలఁ గలయట్టి మర్మమంత- | యును నిజమ్ముగఁ బలికితిఁ గినుక మాని నన్నుఁ గరుణించి యేలుమో వన్నెలాఁడి, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 82 |
| సీ. | నను కనుంగొనఁగానె మనసులో దయయుంచి | నా నేస్తమాలించినావు గనుక బలిమిగా నీ వద్ది చెలికాండ్ల నంపించి | నను బిల్వంగా నంపినావు గనుక చెంతఁ జేరకమున్నె సుంత భేదము లేక | నీవె మచ్చికఁ జేసినావు గనుక తగు చిన్ననాఁటి నేస్తంబు చందానను | నయముగా లాలించినావు గనుక | |
| గీ. | నెట్లు నీ మేలు మఱతు నేనింక నిన్ను | నిమిష మెడఁబాయఁగాజాల నేను దొలుతఁ యేల మాలిమిఁ జేసితి వీ వితాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 83 |
| సీ. | వేళ గాదనక యేవేళ నే వచ్చిన | హితవుగా నీ మనసిచ్చు మేలు నలిగి యుండినవేళ బలుమచ్చికలు సేసి | వేడుక నను గారవించు మేలు నెవరెంత నా నేస్త మెడఁబాపఁ దలఁచిన | నందుల కొప్పనియట్టి మేలు నరనిమిషంబు నే సరసఁ జేరకయున్న | నప్పుడే రప్పించునట్టి మేలు | |
| గీ. | మఱచెదనటన్న వేయుజన్మములకైన | మఱవఁగూడదు నీదగు మచ్చికలకుఁ జాలఁ జొక్కితిఁ దక్కితి సారసాక్షి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 84 |
| సీ. | నీవంటి నెరజాణ నెనరు గావలెనంచు | నెన్నాళ్లో మదిలోన నెంచియెంచి వనజాక్షి! నీతోడ మనవి సెప్పుఁడటంచు | వేమాఱుఁ జెలుల నే వేఁడుకొంటి కనులపండువుగ నే నినుఁ గనుంగొనఁ గోరి | మొనసి దైవములకు మొక్కుకొంటి రమణిరో! నిన్ను నే రతులఁ గూడుటకునై | వేవిధమ్ముల నిన్ను నే వేఁడుకొంటి | |
| గీ. | నట్టి నామీఁద జాలి యొక్కింతలేక | దినము రేపనుచున్నావు ఘనమ నీకు గాసిఁ బెట్టకు మయ్యయో దోసకారి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 85 |
| సీ. | మాటపట్టులఁ గొంతమట్టుగాఁ బోనీక | సరసంబులకు నేల సరసుకొంటి మనసు నిల్పక వృథా మరులు కొన్నది గాక | భావమేటికి బయల్ పఱుచుకొంటిఁ బదరి భావము బయల్ పఱుచుకొన్నది గాక | వేమాఱు నేనేల వేఁడుకొంటి ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... | |
| గీ. | దెలిసెనా మరుఁ డింతకుం దెచ్చెఁ గాని | మోసపోదువు లేకున్న దోసకారి! యించువిల్తుండు సాక్షి యీ యెన్నికలకు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 86 |
| సీ. | క్షణము సేపటు జబ్బు కౌఁగిలింతలె కాని | లెస్సగా బిగి కౌఁగిలించలేదు సవసవలుగను ముచ్చటల నాడుటె కాని | యాస దీరఁగ మాటలాడలేదు మున్నొంటిపాటున ముద్దులుంచుటె గాని | యక్కఱచే మోవి నానలేదు దినదినమ్ముల మతు లెనయుటొక్కటె కాని | తగిన వేడుక రతి దనియలేదు | |
| గీ. | బడలి నేనిట్లు వేఁడినఁ బంతగించి | రాపుఁ జేసెదు కొమ్మ! నీ ప్రాపు నమ్మి చెంతఁ జేరినవాఁడ నా చింతఁ దీర్చు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 87 |
| సీ. | ఎన్నెన్ని కోరిక లెన్నితినో యన్ని | తడయక నీవీ విధంబుఁ జేసి ఎన్నెన్ని ముచ్చట లెన్నితినో యన్ని | వెలయించు మనసెల్ల విఱుగఁ జేసి ఎన్నెన్ని సరసోక్తు లెన్నితినో యన్ని | పలుమాఱు విరిపాన్పు పాలు సేసి ఎన్నెన్ని యోచన లెన్నితినో యన్ని | చేకూర కునికిఁ జీకాకు సేసి | |
| గీ. | మదికొదవఁ జేసి మనసు వేమఱుగఁ జేసి | నీదు వలపును నెనరును నెగడఁజేసి- తకట! నీవెంత చేసిన యంతయౌనె | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 88 |
| సీ. | ఉండుండీ మనసులో నూరక చింతించి | చింతించి యంతలోఁ జిన్నవోదు చిన్నవోయి యొకింత చెచ్చెరఁ దెలిపొంది | తెలివివేళల నిన్నుఁ దలఁచుకొందుఁ దలఁచినంతనె మేను పులకలింతలు చేసెఁ | బులకించి దిక్కులు కలయఁ గందు కలయఁ గన్గొని బయల్ కౌఁగిలింపఁగ నెంతు | నెంచి నిరాశ క్షమించుకొందు | |
| గీ. | ఎటుల సైరింతు మోహమింకె ట్లడంతు | తాపమెటు దీర్తు నెన్నాళ్ళు తల్లడింతు ఎవ్వరికి విన్నవింతు నే రవ్వకెత్తి | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 89 |
| సీ. | సామ్రాజ్య మేలిన చందంబుగాఁ దోఁచు | సుదతి! నీ దయ మీఁద సోకినంత నఖిలంబు కైవసమైనట్లుగాఁ దోచుఁ | జెలి! నీవు ననుఁ జేరఁ బిలిచినంత పట్టాభిషేక మా పగిది నా మదిఁ దోఁచు | సొలపు క్రీగంట నన్ జూచినంత నతివ! నన్ రక్షించినట్టి మచ్చిక దోఁచు | ననవిల్తుకేళిఁ గైకొనినయంత | |
| గీ. | ఇట్టి మోహంబు నింక నేనెటుల సైతు | ఎచ్చటను దాతు విరహాగ్ని నెటులఁ ద్రోతు నయ్యయో! నీకు కరుణ యింతైన రాదు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 90 |
| సీ. | నిలచిన దిక్కున నిల్వనీయదు గుండె | జల్లని వేమాఱుఁ దల్లడిల్లు మాటలాడెదనన్న మాటాడనీయదు | తనువునఁ బ్రాణముల్ తత్తరించు నిదురపోయెదనన్న నిదుర కంటికి రాదు | మరుతాపమున మేను మఱుఁగుచుండు నన్నపానంబుల నాశించబోయినఁ | చెలియ! నా జిహ్వకు జేఁదు దోఁచు | |
| గీ. | తరుణి! నీ బాళి హెచ్చ నింతటికిఁ దెచ్చె | శివములందఁగఁ జేయునా చిగురుటాకు- బాకుఁ గలవాని ననవలెఁగాక నింకఁ, | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 91 |
| సీ. | ఎంత కార్యంబైన నేను గల్గఁగ నీకుఁ | జింత యేలనటంచుఁ జెప్పలేదొ? తనువులు రెండుమాత్రము గాని యిద్దఱి | ప్రాణంబు లొకటని పల్కలేదొ? నా జీవమును గల్గునందాక నే నిన్ను | బాయనంచును ప్రేమఁ బల్కలేదొ? యొకరెంతఁ చెప్పిన యొగ్గుదునని మదిఁ | దలఁపకుమని నీవు పలుకలేదొ? | |
| గీ. | అన్ని మఱచియుఁ గడపట నన్ను బళిర! | పాపమనక మనోవ్యధ పాలుచేసి మిన్నకున్నావు నీకిది మేలె చెలియ! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 92 |
| సీ. | ధేనుకబంధంబు దేలించునట్టి నీ | మెలకువల్ వేమఱుఁ దలఁచితలఁచి కూడి బంధంబునఁ గోరి రమింపఁగ | సొంపులు పెక్కులు చూచిచూచి పరఁగుఁ బద్మాసనబంధంబులను నన్నుఁ | గళలంటి పెనఁగుట కాచికాచి యొక పాద మొనరు బంధంబుల | నేలి మనోధర్మ మెంచియెంచి | |
| గీ. | యెన్ని యెట్లని తాళుదు నేమిసేతు | నీకు దయవచ్చునో రాదొ నెనరు మీఱ నిదియు వివరంబులని పల్కుమిపుడు నాతో | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 93 |
| సీ. | సన్నసైగలను ముచ్చటలాడుటె కాని | హాయిగా సరసంబు లాడలేదు రహి నప్పుడపుడు మర్యాదలెంచుటె కాని | పావురముల్ పలుకు పలుకలేదు కెమ్మోవిఁ జూచి గ్రుక్కిళ్ళు మ్రింగుటె కాని | యాసదీరఁగ నొక్కి యానలేదు కనికని మిగుల నక్కఱల నుండుటె గాని | పెక్కువింతలుగాను పెనఁగలేదు | |
| గీ. | తిన్నఁదనమున నిట్లోర్చి యున్నవాఁడ | నీవు సర్వజ్ఞురాలవు నీకుఁ దెలియ- నట్టి రీతులు నాచేతనౌనె పలుక? | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 94 |
| సీ. | నీకు నాకును గాని లోకులందెవరైనఁ | జేరి యీ మక్కువల్ సేయగలరె? హాయి నుండిన నేమి యాప్తీకరించుక | విడనాడుటలు లేక వెలయఁగలరె? వెలసిరేనియు వింతవింతలుగా రతి- | బంధంబులను గూడి ప్రబలఁగలరె? ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ... | |
| గీ. | యటుల మన మిద్దఱుండుట నవనిజనులు | వీను లలరఁగ బలుకుట వినఁగలేదొ? యది నిజంబుగ నొనరించు మబ్జనేత్ర! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 95 |
| సీ. | పంతమేలనె భామ! పగవాఁడనా నేను? | మనసు మర్మము దాచు మతమదేమి? చింతతో నుండఁగాఁ జేసిన పనియేమి? | మాటలాడక యుండు మార్గమేమి? వంచబాణునికేళిఁ బాయు కారణమేమి? | సంతోష మెడసిన జాడ యేమి? యన్నపానీయమ్ము లంటని విధమేమి? | కనలుచుండెడి క్రూరకర్మమేమి? | |
| గీ. | చెలియ! నా మది మోహంబు సెప్ప నరుదు | దనరు మమతయు విడనాడఁదగునె నీకు? చూడు నామీఁద దయయుంచి సుందరాంగి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 96 |
| సీ. | నీ చక్కఁదనమును నీదు నొయ్యారంబు | నీ మందగమనంబు నీదు సొంపు నీ తిన్నఁదనమును నీదు శాంతగుణంబు | నీ వితరణమును నీదు రచన నీ యౌవనంబును నీదు జాణతనంబు | నీ నెనరును నీటు నీదు వగలు నీ బెళ్కు నీ తళ్కు నీ చక్కఁదనమును | నీ పల్కుప్రియమును నీదు నయము | |
| గీ. | నన్ని మదినెంచ నా తరమానె నీదు | దయకుఁ బాత్రుఁడ నన్నికఁ దప్పఁ జూచి యిన్నిదినములవలెనె నీ వేఁచుచున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 97 |
| సీ. | రాకుమారుఁడ నంచు రాజసంబున నేను | చెలఁగి నీ సేవలు సేయలేదొ? నేర్పుకాఁడ నటంచు నేర్పరితనమున | నీవు నేర్పిన బుద్ధి నేర్చలేదొ? రాజసింహుఁడ నంచు రసికత్వ మెంచియు | నింతి! నీ రసికత్వ మెంచలేదొ? భాగ్యవంతుఁడ నంచుఁ బటువిజృంభణవృత్తి | నాతి! నీకును దగ్గి నడవలేదొ? | |
| గీ. | పలుకుపలుకుకు నే మాఱు పలుకలేదొ | వేఁడినంతనె నే నిన్ను వేఁడలేదొ కటకటా! నన్ను నతివేగఁ గలయకున్న, | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 98 |
| సీ. | మగువ! నిన్నే కాని మనసులో వేఱొక్క | తెరవఁ దలంప భూదేవి యాన యతివ! నిన్నే కాని యాసలో వేఱొక్క | వనితఁ గోరను నభోవాణి యాన సుదతి! నిన్నే కాని చూడను వేఱొక్క | పడఁతిని భారతీభర్త యాన పొలఁతి! నిన్నే కాని పూనిక వేఱొక్క | కలికి నెంచను రమాకాంతు నాన | |
| గీ. | యబల! శివునాన నేఁ గోర నన్యసతుల | నొప్పుకొనుమింక నితర మేనొక్క టెఱుఁగ భావమందైనఁ దప్ప నీ పదము లాన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 99 |
| సీ. | సుందరాంగి వటంచుఁ జూచుచుందును గాని | శృంగారవతులఁ జూచినది లేదు నీదు చక్కనిమోవి నిక్కి చూచుటె కాని | పగడంపులంతఁ జూడ బాళి లేదు నీ గబ్బిగుబ్బల నిలిచి చూచుటే కాని | పుట్లచెండ్లను బూన బుద్ధి రాదు నీ మోముకళలన్ని ప్రేమఁ జూచుటే కాని | చందమామను జూడ సైఁచలేదు | |
| గీ. | కొమ్మ! నీ పొందునే నమ్మి కొదువ లేని- | వాఁడ ననుకొంటి నీకింత మోడి దగునె కాంత! నీతోడ రతికేళిఁ గలయకున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 100 |
| సీ. | నీకుఁ దక్కితి నంచు నీవిట్టు లేఁచేవు | మది యింకఁ దాళదే మందయాన! నా యౌవనముఁ జూచి నవలఁబోవఁ డటంచు | మోడి వహించేవు ముద్దుగుమ్మ! చెప్పినమాటలు చేకొని నిను నంచుఁ | గపటంబు లెంచేవు కంబుకంఠి! రసికత్వ మెంచియు రవ్వఁ గావించేవు | పసివాఁడనా నేను పద్మగంధి! | |
| గీ. | నీ వొసంగిన బాసలు నిక్క మనుచు | నమ్మియుంటిని నిన్నాళ్ళు నమ్మనింక జాలుఁ జాలును నినుఁ గోరి చంద్రవదన | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 101 |
| సీ. | నీవంటి జవరాలి నేఁ గోరినందుకు | ఫలమేమి గంటినే పద్మగంధి! నిన్ను నే బతిమాలి యెన్ని యున్నందుకు | నే వాసి వచ్చెనే యెమ్మెలాడి! వనిత! నీ స్నేహంబు వలచియున్నందుకు | నే రాజ్యమేలితి నిగురుఁబోణి! పడతి! నిన్నెద నమ్మి పరఁగినందున | నే సుఖంబందితి నిందువదన! | |
| గీ. | వట్టి నేరంబులెన్నెదు వట్టి ప్రియము | వట్టిమాటలు సర్వదా వాంఛదీఱ యిట్టి వేదనలందుచు నిచటనున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 102 |
| సీ. | మదనాగ్నిఁ బడియున్న మనసీయవైతివి | కలికి నీ మది నెంత గట్టితనమె శరణంచు మొక్కినఁ గరుణించవైతివి | కోమలి! నీ కెంత గుంభితంబె జాలిగొన్నప్పుడు పాలించవైతివి | వనిత నీ కెంత కువాదమొక్కొ రతికేళికై వేఁడ రమ్మనవై తివి | రామ! నీ కెంత చట్రాయితనమె | |
| గీ. | పలుకు మాటల నమృత మంగిళుల విషము | నునుచుకొనుటెల్లఁ గని యింక నోర్వరాదు తెరవ! కారాని కలఁగని తెలియకున్నఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 103 |
| సీ. | అనుమాటలకు ప్రియ మగ్గలంబై రాదు | వగకానిపై వల్లెవాటు చెఱుఁగు బిగఁబట్టి తానెంత బెగ్గిలిపడి లేచి | పడఁతిఁ బువ్వులపాన్పుపైకిఁ దిగిచి కూర్చుండ నియమించి గొబ్బునఁ గర్పూర | వీడెం బొసంగి యివ్వేళనంత మోము మోమునఁ చేర్చి ముద్దాడి కెమ్మోవి | మొనపంట నొక్కి ఱొమ్మునఁ గడంగి | |
| గీ. | గుబ్బచన్నులు కసిదీరఁ గుమ్మి సొంపు | పరఁగు మరుకేళి చౌసీతిబంధములను నేలి సోలించి లాలించు నీలవేణి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 104 |
| సీ. | వగకాఁడ! యింతలో మిగులమాటల నెన్ని | తేకువల్ గురియించ నీకు దగునె? భ్రమకాఁడ! యింతలో బావినీళ్ళన్నియు | వెల్లువఁ బోవ నీ వెంచఁదగునె? చెలికాఁడ! నీవేలు చిత్తజు రాజ్యంబు | నొకరు నేలుదురంచు నుండఁదగునె? లయకాఁడ! దుర్గముల్ పరుల చేతికి నబ్బు- | నంచు నీ మదిలోన నెంచఁదగునె? | |
| గీ. | యనుచు నన్నను మాటలు నాత్మ మఱఁచి | యాటపాటల తేటల నన్ని వగల జాణతనమున మానిన సకియ! నేఁడు | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 105 |
| సీ. | ఈ వింతరచనల నీ సంతసంబుల | నీ ముద్దుపలుకుల నీదు బెళుకు నీ వన్నెచిన్నెల నీ విలాసంబుల | నీ కుల్కుతనముల నీదు విధము నీ మంచితనముల నీ మధురోక్తుల | నీ జాణతనముల నీదు గతుల నీ ఘనయుక్తుల నీ దేహకాంతుల | నీ సరసోక్తుల నీదు రతుల | |
| గీ. | నేలుచును నన్ను రక్షించు మేలు గలుగ- | వచ్చె నీ దయ నామీఁద వాంఛ దీఱె నిటుల నీతోడఁ గూడక యిచటనుండఁ | దాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 106 |
| సీ. | వలవు రెట్టించి నే బలిమిగా వేఁడుట | తలఁతువో తలపవో కులుకులాడి! ఆసించి నన్ను నే ననుసరించుటలెల్ల | తోఁచునో తోఁచదో తోయజాక్షి! బాళి నిల్పఁగలేక బలువెతల్ చెందుట | తెలుతువో తెలియవో కలువకంటి! యందఱిలో వృథా యారుదూఱైనది | యెంతువో యెంచవో యిందువదన! | |
| గీ. | కటకటా! యింత యన్యాయకారి వనుచు | నెమ్మనంబున దోఁచక నిన్ను వలఁచి మోసపోయితి నయ్యయ్య దోసకారి! | తాళనిచ్చునె ప్రేమ కాంతాలలామ! | 107 |
| కాంతాలలామ శతకము సంపూర్ణము. | ||